News August 13, 2024

HYD: భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఎస్

image

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (HRRR) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. మంగళవారం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతిష్ఠాత్మక RRR ప్రాజెక్టు రాష్ట్రంలో అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకుందని, భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు.

Similar News

News February 24, 2026

సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో జపాన్ టూరిస్టుల సందడి

image

జపాన్ నుంచి నగరానికి వచ్చిన పర్యాటకులు South India Shopping Mallలో సందడి చేశారు. భారతీయ సంప్రదాయం, ఆధునిక డిజైన్‌లు, విస్తృత కలెక్షన్లు ఒకేచోట లభించడం వారిని ఆకట్టుకున్నట్లు తెలిపారు. దక్షిణ భారత సంప్రదాయ వస్త్రాల నాణ్యత, సరసమైన ధరలు, ఆతిథ్య సేవలు ప్రత్యేకంగా నచ్చాయన్నారు. ‘ఇది జీవితంలో బెస్ట్ షాపింగ్ అనుభవం’ అని వారు పేర్కొన్నారు. విదేశీయులను తమ మాల్ ఆకట్టుకుంటుందని నిర్వాహకులు తెలిపారు.

News February 24, 2026

HYD: నేడు ఆర్టీసీ సంఘాల చలో సెక్రటేరియట్

image

నేడు ఆర్టీసీ సంఘాలు చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన కాకుండా సొంతంగా సమకూర్చుకోవడం, ఉద్యోగులపై పని ఒత్తిడి, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లతో నిరసన వ్యక్తం చేయనున్నాయి. దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చయి.

News February 24, 2026

HYD ‘గొంతు’పై కత్తి.. సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

image

నగరవాసుల గొంతు తడిపే హిమాయత్, ఉస్మాన్‌సాగర్‌లలో కాలుష్య కారకాలు పెరిగిపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్& అర్బన్ డెవలప్‌మెంట్, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర పీసీబీ, GHMC, HMDA కమిషనర్లకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ మార్చి 26కు వాయిదా వేసింది.