News August 13, 2024

HYD: భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఎస్

image

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (HRRR) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. మంగళవారం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతిష్ఠాత్మక RRR ప్రాజెక్టు రాష్ట్రంలో అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకుందని, భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు.

Similar News

News September 8, 2024

HYD: బాలాపూర్ గణపతి ప్రత్యేకతలు ఇవే..!

image

HYD బాలాపూర్ గణపతిని కళాకారులు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. తలపై భాగంలో అమృతం కోసం సముద్ర మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహ చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడో చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

News September 7, 2024

HYD కమిషనరేట్ చరిత్రలో రెండు సార్లు సీపీలుగా వీరే!

image

HYD సిటీ కమిషనరేట్ చరిత్రలో రెండు సార్లు సీపీగా బాధ్యతలు చేపట్టిన వారిలో హసన్ అలీ ఖాన్ మొదటి వరుసలో ఉన్నారు. తర్వాత B.N. కాలియా రావు, S.P.సాతూర్, విజయ రామారావు, ప్రభాకర్ రావు, అప్పారావు, RP సింగ్ IPS ఉన్నారు. ఇదే కోవలోకి 2021లో HYD సీపీగా విధులు నిర్వర్తించిన CV ఆనంద్ రానున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో 2024లో మరోసారి HYDకి సీపీ కానున్నారు. 1945 నుంచి 4 ఏళ్లకు మించి సీపీగా ఎవరూ లేరు.

News September 7, 2024

HYD: రాజ్‌భవన్‌లో వినాయక చవితి వేడుకలు

image

HYD సోమాజిగూడలోని రాజ్‌భవన్‌ దర్బార్ హాల్‌లో వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గణేశుడికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈ గణేశ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థులు సాదా బంకమట్టితో పర్యావరణ అనుకూలంగా తయారు చేశారు. విషరహిత కూరగాయల రంగులతో పెయింట్ వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.