News February 15, 2025

HYD: మంచినీటి సరఫరా.. మూడంచెల్లో క్లోరినేషన్!

image

జలమండలి నీటిని మూడంచెల్లో క్లోరినేషన్ చేస్తుందని HYDలో ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో నీటి శుద్ధి కేంద్రాలు, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ చేస్తుంది. దీంతో పాటు ప్రజలకు సరఫరా చేసే నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న‌ట్లు వివ‌రించారు.

Similar News

News September 18, 2025

HYDలో స్పీడ్ ఇంతే.. పెద్దగా ఏం మారలే..!

image

మహానగరంలో రోడ్లపై వాహనాల వేగం రోజురోజుకూ తగ్గిపోతోంది. కారణం ట్రాఫిక్ జామ్. రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్య నగర రోడ్ల విస్తీర్ణం సరిపోవడం లేదు. ప్రస్తుతం సిటీలో సొంత వాహనాలే 90 లక్షలకు చేరుకున్నాయి. ఇక బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు అదనం. 2024లో సిటీలో సగటు స్పీడ్ 18KMPH ఉంటే ప్రస్తుతం 24 KMPHకు పెరిగింది. ఇక అర్థం చేసుకోండి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో.

News September 18, 2025

జుట్టు లేని కొబ్బరి కాయను కొట్టకూడదా?

image

దేవుడికి జుట్టు లేని కొబ్బరికాయను కొట్టకూడదని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయ మన శరీరానికి ప్రతీక. దానిపై ఉన్న పీచు మనలోని అహంకారానికి, జ్ఞానానికి చిహ్నం. భగవంతునికి మన శరీరాన్ని, ఆత్మను సంపూర్ణంగా సమర్పించుకోవడానికి కొబ్బరికాయ కొడతాం. అందుకే జుట్టు ఉన్న కొబ్బరికాయనే కొట్టి, ఆత్మనివేదన అనే భక్తి మార్గాన్ని అనుసరించాలి. జుట్టు లేని కాయను సమర్పించడం అసంపూర్ణ సమర్పణగా భావిస్తారు.

News September 18, 2025

సాయిబాబా విగ్రహం పాలరాయితోనే ఎందుకు?

image

పాలరాయి ఆధ్యాత్మికంగా స్వచ్ఛతకు, బలానికి ప్రతీక. ఈ లక్షణాలు బాబా బోధనలకు అనుగుణంగా ఉంటాయి. పాలరాయి విగ్రహం ఉన్న చోట ప్రశాంతమైన, సామరస్య పూర్వక వాతావరణం ఏర్పడుతుందని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఇది సహజమైనది, ప్రాసెస్ చేయనిది కావడంతో పవిత్రంగా పూజా మందిరాల్లో ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అనేక ఆలయాల్లోనూ పాలరాయితో చేసిన సాయిబాబా విగ్రహాలే మనకు దర్శనమిస్తుంటాయి.