News February 15, 2025
HYD: మంచినీటి సరఫరా.. మూడంచెల్లో క్లోరినేషన్!

జలమండలి నీటిని మూడంచెల్లో క్లోరినేషన్ చేస్తుందని HYDలో ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో నీటి శుద్ధి కేంద్రాలు, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ చేస్తుంది. దీంతో పాటు ప్రజలకు సరఫరా చేసే నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.
Similar News
News March 19, 2025
మహబూబాబాద్‌లో జాబ్ మేళా

ముతూట్ మైక్రో ఫిన్ లిమిటెడ్ కంపెనీ, మహబూబాబాద్ బ్రాంచ్‌లో ఖాళీగా ఉన్న రిలేషన్ షిప్ అధికారి పోస్టుకు మార్చ్ 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రజిత ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్/డిగ్రీ విద్యార్హత గల అభ్యర్థులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జిల్లా ఉపాధి కార్యాలయంలో మార్చ్ 20న ఉ.10:30 నుంచి మ.2 గంటల వరకు జరిగే జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు.
News March 19, 2025
జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయండి: తిరుపతి కలెక్టర్

తిరుపతి జిల్లాలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతాలను.. పర్యాటక, అటవీశాఖ అధికారులు సమన్వయంతో అభివృద్ది చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, DFO వివేక్‌తో కలసి సమీక్షించారు. ఎర్రచందనం మొక్కలు జియో ట్యాగింగ్ తదితర అంశాల గురించి చర్చించారు. తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సూచించారు
News March 19, 2025
ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు విడుదల

TG: మహిళా, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్-1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను TGPSC విడుదల చేసింది. మెరిట్ జాబితాను <