News December 1, 2024

HYD: మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలి: కిషన్ రెడ్డి

image

తెలంగాణలో కొత్త రక్తం చేరబోతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం నాంపల్లి పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలని, తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని మోదీ చెప్పారని అన్నారు. డిసెంబర్ 6న సరూర్‌‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు తెలిపారు.

Similar News

News December 7, 2024

ఖైరతాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణ.. కేంద్రమంత్రికి ఆహ్వానం

image

రాజ్‌భవన్ దిల్ కుశా గెస్ట్‌హౌస్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకూ రావాలన్నారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు పొన్నం తెలిపారు.

News December 7, 2024

HYD: డ్రగ్స్, సైబర్ కేసుల్లో కఠిన శిక్ష పడేలా చర్యలు: CM

image

హైదరాబాద్‌లో డ్రగ్స్, సైబర్ మహమ్మారి చేప కింద నీరులా విస్తరిస్తన్న నేపథ్యంలో డ్రగ్స్ నిరోధించడంలో కొంత ప్రగతి సాధించినప్పటికీ అది సరిపోదని, మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాల్లో కఠిన శిక్ష పడేలా స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేసి, నిపుణులైన అధికారులను నియమించాలన్నారు. ఈ కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

News December 7, 2024

HYDలో మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు

image

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే తమ లక్ష్యమని చెప్పిన ప్రభుత్వం HYD నగరంలో పలుచోట్ల మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. సికింద్రాబాద్ జోన్లో స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్లను గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి ప్రారంభించినట్లు తెలిపారు.