News February 8, 2025
HYD: మంత్రికి TWJF ప్రతినిధుల వినతిపత్రం

HYDలోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి దామోదరరాజనర్సింహను TWJF ప్రతినిధుల బృందం కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. హెల్త్ కార్డులు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నా.. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పట్టించుకోవడంలేదని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
Similar News
News December 2, 2025
సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు

సౌత్ సెంట్రల్ రైల్వే(<
News December 2, 2025
సూర్యాపేట జిల్లా ఎస్పీ హెచ్చరిక

జిల్లాలో ఎన్నికల కోడ్ నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని సూర్యాపేట ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పండుగలా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు శాఖ పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోందని, మొత్తం 486 గ్రామాలకు గాను, 170 సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ప్రజలు భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.
News December 2, 2025
జగిత్యాల: సర్పంచ్, వార్డు పోటీదారుల DEALS

జగిత్యాల(D)లో సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు నీవు నాకు మద్దతిస్తే నేను నీకు సపోర్ట్ చేస్తానంటూ మాట్లాడుకుంటున్నారు. సర్పంచ్‌కు నాకు మద్దతిస్తే, వార్డులలో నీకు మద్దతిస్తానంటూ సర్పంచ్, వార్డ్ అభ్యర్థులు ఒప్పందం చేసుకుంటున్నారు. అలాగే వార్డులకు పోటీ చేసేవారు నేను పోటీ చేస్తున్న వార్డులో నన్ను సపోర్ట్ చేస్తే నీవు పోటీ చేస్తున్న వార్డులో నీకే మద్దతిస్తా అంటూ డీల్స్ చేసుకుంటున్నారు.


