News July 4, 2024

HYD: మంత్రివర్గంలో చోటుపై ఎమ్మెల్యేల లాబీయింగ్

image

ఉమ్మడి RR జిల్లాలోని పరిగి MLA రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు పదవి ఇవ్వాలని అధిష్ఠానానికి విన్నవిస్తున్నారు. కాగా ఇప్పటికే తమ నేత మంత్రి అవనున్నారని, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో ఎవరు మంత్రి అవతారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Similar News

News December 1, 2025

HYD మెట్రో‌లో ట్రాన్స్‌జెండర్లకి ఉద్యోగాలు

image

తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీస్ శాఖలోనే కాకుండా మెట్రో రైల్‌లో సైతం ట్రాన్స్‌జెండర్లకి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఇటీవల సుమారు 20 మందిని ఎంపిక చేసిన మెట్రో అధికారులు వారికి శిక్షణ ఇచ్చారు. నేటి నుంచి ట్రాన్స్‌జెండర్లు వారికి కేటాయించిన మెట్రో స్టేషన్లలో సేవలు అందిస్తున్నారు. రైళ్ల రాకపోకల వివరాలతో పాటు, మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో ప్రముఖ పాత్ర వహించనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.

News December 1, 2025

పాతబస్తీలో అండర్‌గ్రౌండ్ సర్జరీ!

image

మెట్రో రైలు ఫేజ్-II (MGBS-చాంద్రాయణగుట్ట) కారిడార్‌లో పాతబస్తీకి శాశ్వత పరిష్కారం దక్కనుంది. కేవలం ఆరు నెలల్లోనే రూ.39.6 కోట్లతో కీలక జల వసతి పనులు పూర్తి చేయాలని HMWSSB నిర్ణయించింది. మైసారం, అలియాబాద్, మిస్రిగంజ్, దారుల్షిఫా, మొఘల్‌పురా, జంగంమెట్, గౌలిపురా, ఎంఆర్జీ ప్రాంతాల మీదుగా ఉన్న 100-1200 mm డయా తాగునీరు, డ్రైనేజీ లైన్లను మెట్రో పిల్లర్ల మార్గం నుంచి పూర్తిస్థాయిలో మార్చనున్నారు.

News December 1, 2025

హైదరాబాద్ శివారు రోడ్లకు మహర్దశ

image

HYD శివారు రోడ్ల విస్తరణ కోసం ప్రభుత్వం రూ.390కోట్ల భారీ ప్రాజెక్టును ప్రకటించింది. 148.85 కి.మీ. మేర రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దడానికి టెండర్లు పిలిచింది. HAM పద్ధతిలో ప్రాజెక్టును చేపడుతున్నారు. దీని ప్రకారం, ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో కొంత భాగాన్ని ప్రభుత్వం నేరుగా భరిస్తుంది. ఈప్రాజెక్టును (PPP) ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాంతో చేపట్టనున్నట్లు అధికారులు Way2News‌కు తెలిపారు.