News November 13, 2024

HYD: మంత్రి పొంగులేటితో ముఖాముఖి

image

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకే మంత్రులతో ముఖాముఖి ఏర్పాటు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. వెంటనే ఆయా అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News February 23, 2026

HYD: తెలుగు వర్సిటీలో పురస్కారాలు.. దరఖాస్తు చేసుకోండి

image

MAR 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా తెలుగు వర్సిటీలో యువ పురస్కార ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. నటన, దర్శకత్వం, మేకప్, లైటింగ్ ఇతర రంగాల్లో కృషిచేసిన యువత పురస్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 35ఏళ్లలోపు ఉన్నవారు అర్హులు. రిజిస్ట్రార్, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ, బాచుపల్లికి పోస్టు ద్వారా/నేరుగా MAR 5లోపు అప్లికేషన్స్ పంపవచ్చు.

News February 23, 2026

HYD: 2BHK ఇళ్ల కోసం.. ఇంకెన్నాళ్లీ నిరీక్షణ..?

image

BRS నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నివసించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కేటాయింపులు జరగడం లేదని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొల్లూరు, అమీన్‌పూర్ ఇతర ప్రాంతాల్లో ఇళ్లు పంచేందుకు సిద్ధంగా ఉన్నా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ఆశావహులకు అవి అందుతాయో లేదో తెలియని అయోమయం నెలకొంది. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించడంతో పాత ఇళ్ల కేటాయింపుపై సందిగ్ధత ఏర్పడింది.

News February 23, 2026

HYD: 8712441912కు Hi అని పంపండి

image

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారుల కోసం వాట్సాప్ చాట్‌బాట్‌ ప్రారంభించింది. <<8712441912>>8712441912<<>> నంబర్‌కు విద్యుత్ సంస్థతో లింక్ అయిన మొబైల్ నంబర్‌ నుంచి వాట్సాప్‌లో Hi అని పంపితే ఫిర్యాదుల నమోదు, బిల్ వివరాలు, విద్యుత్ సరఫరా స్థితి వంటి సేవలు పొందవచ్చు. ఛైర్మన్& ఎండీ ముషారఫ్ ఫరూఖీ ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ఎప్పుడైనా, ఎక్కడైనా విద్యుత్ సమాచారాన్ని సులభంగా పొందే అవకాశం కల్పించారు.