News March 19, 2025
HYD: మంత్రి సీతక్క పేరుతో నకిలీ MLA స్టిక్కర్

హైదరాబాద్ నకిలీ MLA స్టిక్కర్ వేసుకొని సంచరిస్తున్నారు. తాజాగా మంత్రి సీతక్క పేరుతో ఉన్న నకిలీ స్టిక్కర్ వాహనం (TG 09 HT R 1991)THARపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులకు బుధవారం ఫిర్యాదు అందింది. మంత్రి పీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కార్ సీజ్ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 10, 2025
కేతకీ పుష్పాన్ని పూజలో ఎందుకు వినియోగించరు?

శివ పూజలో కేతకీ పుష్పం వాడరన్న విషయం తెలిసిందే! శివుని జ్యోతిస్తంభం ఆది, అంతాలను కనుగొన్నానని బ్రహ్మ అబద్ధం చెప్పడానికి ఈ పుష్పాన్నే సాక్ష్యంగా చూపాడట. అది అబద్ధపు సాక్ష్యమని గ్రహించిన శివుడు తన పూజలో ఈ పుష్పాన్ని వాడొద్దని శపించాడు. అందుకే శివపూజలో మొగలి పువ్వును వాడరు. అయినప్పటికీ శివ భక్తులు దీనిని తలలో ధరించవచ్చని, పూజా ప్రాంగణంలో అలంకారం కోసం ఉపయోగించవచ్చని పురోహితులు సూచిస్తున్నారు.
News December 10, 2025
తిరుపతి: కళ్లు లేకున్నా.. 200KM స్కేటింగ్

తిరుపతి జిల్లాకు చెందిన అంధ స్కేటర్ మురారి హర్షవర్ధన్ నాన్‌స్టాప్‌గా 200 KM బ్లైండ్ స్కేటింగ్ మారథాన్ చేశాడు. ఆర్టిస్టిక్, మల్టీటాస్క్ విభాగాల్లో ప్రపంచ రికార్డులు సాధించాడు. సంబంధిత సర్టిఫికెట్లను తిరుపతిలో మంగళవారం సాయంత్రం బాలుడికి అందజేశారు. వండర్ బుక్, జీనియస్ బుక్, వజ్ర రికార్డ్స్ ప్రతినిధులు పురస్కారాలు ఇచ్చారు. హర్షవర్ధన్ అందరికీ ఆదర్శమని పలువురు పేర్కొన్నారు.
News December 10, 2025
శరీరంలో ఈ మార్పులు వస్తే జాగ్రత్త!

చాలా మంది కిడ్నీ సమస్యలను త్వరగా గుర్తించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వచ్చే కొన్ని మార్పులను గమనించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ లేదా రాత్రి వేళల్లో అతి మూత్రం, మూత్రంలో నురుగు/ఎర్రటి రంగు, ముఖం/పాదాలు లేదా శరీరం ఉబ్బినట్లు అనిపిస్తే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. బీపీ పెరుగుతున్నా కిడ్నీ సమస్యలుగా గుర్తించాలని చెబుతున్నారు.


