News January 4, 2025
HYD: మంత్రులను, డీజీపీని కలిసిన హైడ్రా కమిషనర్

HYDలో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డీజీపీ జితేందర్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిశారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైడ్రా తీసుకోబోయే చర్యలపై విస్తృతంగా చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. చట్టపరంగానే చెరువులు, ప్రభుత్వ భూములకు రక్షణ కల్పిస్తామన్నారు.
Similar News
News October 17, 2025
HYD: రాసిపెట్టుకో.. కారు పర్మినెంట్‌గా ఫాంహౌస్‌కే: కాంగ్రెస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా మారింది. ‘పదేళ్ల విధ్వంసానికి రెండేళ్ల అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది KTR!.. నువ్వు ఎంత తిమ్మిని బమ్మి చేసినా మీ BRSను జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మరు. మీ సానుభూతి డ్రామాలు నమ్మి మోసపోయే స్థితిలో ఇక్కడి జనం లేరు.. ఈ ఎన్నిక తర్వాత మీ కారు ఇక శాశ్వతంగా ఫాంహౌస్‌కే.. రాసిపెట్టుకో!!’ అని Xలో Tకాంగ్రెస్ ట్వీట్ చేసింది.
News October 17, 2025
HYD: రూ.కోటి విలువైన హ్యాష్ ఆయిల్ సీజ్

HYDలో హాష్ ఆయిల్ దందాలో మైనర్లు పట్టుబడ్డారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా హాష్ ఆయిల్‌ను పట్టుకున్నారు. సుమారు రూ.కోటి విలువ చేసే 6.5కిలోల హాష్ ఆయిల్‌ని మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో దీనికి సంబంధించిన వివరాలు రాచకొండ సీపీ సుధీర్ బాబు నెరేడ్మెట్ నుంచి వెల్లడించనున్నారు.
News October 17, 2025
HYD: రేపటి బంద్ శాంతియుతంగా జరగాలి: డీజీపీ

వివిధ పార్టీలు తలపెట్టిన రేపటి బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. బంద్ పేరుతో అవాంఛనీయ ఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకుగానీ పాల్పడితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తమన్నారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తాయి. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డీజీపీ సూచించారు.