News August 7, 2024
HYD: మందు కోసం ఫ్లై ఓవర్ నుంచి దూకేశాడు!
నగరంలోని PVNR ఎక్స్‌ప్రెస్ వే పైనుంచి ఓ వ్యక్తి దూకేశాడు. అత్తాపూర్ పోలీసుల వివరాల ప్రకారం.. రాంబాగ్‌లో నివాసముండే అంబదాస్ (40)కు వివాహం కాలేదు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని తన తల్లిని అడిగాడు. ఆమె నిరాకరించడంతో గొడవ పెట్టుకొని బయటకెళ్లిపోయాడు. మనస్తాపంతో అత్తాపూర్‌లోని PVNR ఎక్స్‌ప్రెస్ వే పైకి ఎక్కి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో అతడికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
Similar News
News September 16, 2024
HYD: SEP 17.. ఒకే రోజు మూడు కార్యక్రమాలు!
HYD నగరంలో సెప్టెంబర్ 17న ఒకేరోజు మూడు కార్యక్రమాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుపనుంది. అదే రోజును రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సెప్టెంబర్ 17న ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సైతం ప్రారంభంకానుంది.
News September 15, 2024
HYDలో రాపిడో రైడర్ దారుణహత్య
HYD బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పంచశీలకాలనీ సమీపంలో కొత్తగూడెంకు చెందిన దినేశ్ దారుణహత్యకు గురయ్యాడు. నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. మృతుడు రాపిడో బైక్ రైడర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 15, 2024
HYD: 16న నాగపూర్-సికింద్రాబాద్ ‘వందే భారత్’ ప్రారంభం
నాగపూర్ నుంచి సికింద్రాబాద్(SEC) మార్గంలో ఈ నెల 16న వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. నాగపూర్ నుంచి ఉ.5 గంటలకు బయలుదేరి మ.12:15కు SEC చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో SEC నుంచి మ.1 గంటకు బయలుదేరి రా.8:20కు నాగపూర్ చేరుకుంటుంది.కాజీపేట, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవగ్రాంలో హాల్టింగ్ ఉంటుంది.