News May 12, 2024
HYD: మధుయాష్కి గౌడ్ ఇంట్లో తనిఖీలు!

HYD పరిధి హయత్నగర్లో డబ్బులు పంచుతున్నారనే ఫిర్యాదు మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఈరోజు కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ ఇంట్లో తనిఖీలు చేపడుతోంది. తనిఖీల్లో భాగంగా కాంగ్రెస్ నేత ఇంటి పరిసరాల్లో ఉన్న వారితో మాట్లాడి, డబ్బు పంపిణీపై ప్రత్యేక బృందం ఆరా తీసింది. రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, డబ్బు పంపిణీని అడ్డుకోవడం కోసం అధికారులు ఎక్కడికక్కడ నిఘా పెట్టారు.
Similar News
News December 11, 2025
BREAKING: కాంగ్రెస్ సపోర్ట్.. లగచర్లలో సర్పంచ్ ఈయనే!

వికారాబాద్ జిల్లాలో ఉత్కంఠను రేపిన లగచర్లలో కాంగ్రెస్ మద్దతుదారుడు ఘన విజయం సాధించారు. ఇక్కడ గెలిచేందుకు ప్రత్యర్థులు సర్వ శక్తులు ఒడ్డినా.. చివరి నిమిషంలో వెంకట్రాములు గౌడ్ 15 ఓట్ల తేడాతో గెలుపొందారు. BRS బలపరిచిన గుండెమోని బసప్ప ఓటమి చవిచూశారు. దీంతో వెంకట్రాములుకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేశాయి.
News December 11, 2025
వార్డులు.. HYDలో వార్ మొదలు

GHMC వార్డులను 150 నుంచి ఏకంగా 300కు పెంచడంతో నగరంలో ఎన్నికల వేడిని రాజేసింది. ఈ నిర్ణయం కాంగ్రెస్-MIM రహస్య ఒప్పందమంటూ BJP తీవ్రస్థాయిలో మండిపడుతోంది. MIM డివిజన్లను 46 నుంచి 90కి పెంచి, కాంగ్రెస్ పరోక్షంగా లబ్ధి పొందుతోందని కమలదళం ధ్వజమెత్తింది. GHMC పరిధిలోని 50కి పైగా డివిజన్లలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లకు గాలం వేస్తూ ఎన్నికల వ్యూహాలకు INC పదును పెడుతోంది. అసలు ఆట ఇప్పుడే మొదలైంది.
News December 11, 2025
HYD: బ్యాలెట్ పేపర్ చించేశాడు.. ఓటరుపై కేసు

శంషాబాద్లో బ్యాలెట్ పత్రాన్ని చింపేసిన వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ పరిధిలోని బురుజు గడ్డ తండాలో పోలింగ్ కేంద్రానికి ఉదయం ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి బ్యాలెట్ పత్రాన్ని చించి వేశారు. ఈ ఘటనపై ఎలక్షన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక అభ్యర్థికి ఓటు వేయబోయి.. పొరపాటున మరొకరికి తన ఓటు వేశానని పేపర్ చింపివేసినట్లు విచారణలో తేలింది.


