News February 20, 2025
HYD: మన పోలీసులకు మెడల్స్.. DGP ప్రశంసలు

జార్ఖండ్లోని రాంచీలో 68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ పోటీల్లో మన పోలీసులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. 18 పతకాలతో ఓవరాల్ టీమ్ ఛాంపియన్గా అవతరించిందని CID DG షికా గోయల్ అన్నారు. బంగారు పతకాలు-6, రజతం-6, కాంస్య పతకాలు-8 సాధించగా డీజీపీ జితేందర్ వారిని అభినందించారు. పోటీల్లో పాల్గొన్న వారిలో డాగ్ స్క్వాడ్ పోలీసులు, కంప్యూటర్ అవేర్నెస్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ బృందాలు ఉన్నట్లు తెలిపారు.
Similar News
News December 9, 2025
సిద్దిపేట: పొలంలో ఎన్నికల ప్రచారం

సిద్దిపేట జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎలక్షన్లో భాగంగా అభ్యర్థులు ఎవరికీ తోచినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు. నంగునూరు మండలం సిద్దన్నపేటలో సర్పంచ్ అభ్యర్థి బెదురు తిరుపతి వ్యవసాయ క్షేత్రంలో కూలీలు వారి నాటు వేస్తున్నారని తెలుసుకుని పొలం దగ్గరకి వెళ్లి మరి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
News December 9, 2025
గద్వాల్: నేటితో ముగియనున్న ప్రచారం

తొలి విడుత పంచాయతీ సమరం రెండు రోజుల్లో ముగియనుంది. జిల్లాలో ధరూర్, గద్వాల్, గట్టు, కేటిదొడ్డి మండలాల్లో మొదటి విడుత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 106 గ్రామ పంచాయతీ, 974 వార్డు మెంబర్లకు గాను 14 సర్పంచ్, 120 వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికి పోరు జరగనుంది. నేటితో ప్రచారానికి END కార్డు పడనుంది.
News December 9, 2025
మచ్చలు పడుతున్నాయా?

చాలామంది మహిళలు తప్పు సైజు, నాణ్యత తక్కువగా ఉన్న లోదుస్తులను వాడతారు. దీని వల్ల కొన్నిసార్లు చర్మంపై మచ్చలు పడే అవకాశం ఉంది. వీటిని పోగొట్టడానికి కొన్ని ఇంటి చిట్కాలు. * స్పూన్ పంచదారలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి మర్దనా చేయాలి. * పాలు, బాదం నూనెలను కలిపి మచ్చలున్న ప్రాంతాల్లో రాయాలి. * పెరుగులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న దగ్గర రాస్తే మార్పు కనిపిస్తుంది.


