News February 20, 2025
HYD: మన పోలీసులకు మెడల్స్.. DGP ప్రశంసలు

జార్ఖండ్‌లోని రాంచీలో 68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ పోటీల్లో మన పోలీసులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. 18 పతకాలతో ఓవరాల్ టీమ్ ఛాంపియన్‌గా అవతరించిందని CID DG షికా గోయల్ అన్నారు. బంగారు పతకాలు-6, రజతం-6, కాంస్య పతకాలు-8 సాధించగా డీజీపీ జితేందర్ వారిని అభినందించారు. పోటీల్లో పాల్గొన్న వారిలో డాగ్ స్క్వాడ్ పోలీసులు, కంప్యూటర్ అవేర్నెస్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ బృందాలు ఉన్నట్లు తెలిపారు.
Similar News
News July 9, 2025
MIM నేతల పట్ల మెతక వైఖరి లేదు: హైడ్రా

TG: తాము ఎంఐఎం నేతల పట్ల ఎలాంటి మెతక వైఖరిని అవలంబించట్లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైడ్రా మొదటి కూల్చివేత ఎంఐఎం నేతలకు సంబంధించిన ఆక్రమణలేనని పేర్కొంది. ఇటీవల కూల్చివేతల్లోనూ HYD చాంద్రాయణగుట్టలోని MIM కార్పోరేటర్లకు చెందిన దుకాణాలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. తాము పారదర్శకంగా పనిచేస్తున్నామని తెలిపింది. సామాజిక కారణాలతో <<16969545>>ఫాతిమా కాలేజీ<<>> కూల్చివేతను నిలిపివేశామంది.
News July 9, 2025
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. ABVP ప్రస్థానమిదే!

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) 77వ వసంతంలోకి అడుగు పెట్టింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగమైన ఈ సంస్థను 1949 జులై 9న ఏర్పాటు చేశారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ‘రాష్ట్రీయ ఛత్ర దివస్’ (జాతీయ విద్యార్థి దినోత్సవం)గా కార్యకర్తలు నిర్వహిస్తుంటారు. విద్యార్థులలో జాతీయవాద భావనను పెంపొందించడం, విద్యా సంస్కరణలను ప్రోత్సహించడం, విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ABVP పనిచేస్తోంది.
News July 9, 2025
దేవీపట్నంలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

దేవీపట్నం మండలం పెద్దవుర గ్రామానికి చెందిన మిర్తివాడ రమణారెడ్డి బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందాడని అతని సోదరి వీరవేణి తెలిపారు. యానాం సమీపంలో కోనవానిపాలెం గ్రామంలో రొయ్యల చెరువు వద్ద వారం రోజుల కిందట కూలి పనికి వెళ్లి చెరువులో పడి మృతి చెందాడన్నారు. యజమాని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సోదరుడి మృతిపై అనుమానం ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.