News May 24, 2024

HYD: మమ్మల్ని కొనసాగించండి: ఔట్ సోర్సింగ్ సిబ్బంది

image

తమకు పూర్తి వేతనం చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం HYDలో వారు మాట్లాడుతూ.. కేవలం 10 నెలలకే జీతం ఇవ్వడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇతర గురుకుల సంస్థల్లో ఇచ్చినట్లు తమకు 12 నెలలపాటు వేతనాలు చెల్లించాలన్నారు. గత నెలలో 4వేల మంది సిబ్బందిని 2 నెలలపాటు తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు.

Similar News

News December 22, 2025

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్

image

హైదరాబాద్: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. 40 మంది యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన యూనివర్సిటీ సిబ్బంది వైద్య చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రుల్లో తరలించారు. ఆహారం కలుషితం కావడంతో(డీ హైడ్రేషన్) వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News December 22, 2025

జీహెచ్‌ఎంసీ డిలిమిటేషన్‌పై హైకోర్టులో మరిన్ని పిటిషన్లు

image

జీహెచ్‌ఎంసీ డిలిమిటేషన్‌పై హైకోర్టులో మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వార్డుల విభజన చేశారని లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే వార్డుల మ్యాప్, జనాభా వివరాలపై సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

News December 22, 2025

HYD: విలీనం.. జనంపై రూ.800 కోట్ల భారం!

image

ULBs విలీనంతో అభివృద్ధి సంగతేమోగానీ, పన్నుల వసూళ్లే లక్ష్యంగా కనిపిస్తోంది. 27 మున్సిపాలిటీల పరిధిలోని 8 లక్షల ప్రాపర్టీస్ గ్రేటర్ పరిధిలోకి తెచ్చారు. రూ.800 కోట్ల అదనపు పన్ను వసూలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.3,100 కోట్లకు పన్ను వసూళ్లు చేరనున్నాయని అధికారులు Way2Newsకు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ పన్నుల వసూలును పూర్తి చేయాలని వేగంగా పావులు కదుపుతున్నారు.