News May 24, 2024
HYD: మమ్మల్ని కొనసాగించండి: ఔట్ సోర్సింగ్ సిబ్బంది

తమకు పూర్తి వేతనం చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం HYDలో వారు మాట్లాడుతూ.. కేవలం 10 నెలలకే జీతం ఇవ్వడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇతర గురుకుల సంస్థల్లో ఇచ్చినట్లు తమకు 12 నెలలపాటు వేతనాలు చెల్లించాలన్నారు. గత నెలలో 4వేల మంది సిబ్బందిని 2 నెలలపాటు తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు.
Similar News
News February 14, 2025
HYD: కుంభమేళాకు వెళ్తున్న కారుకు యాక్సిడెంట్.. వ్యక్తి దుర్మరణం

కుంభమేళాకు వెళ్తున్న HYD వాసులు ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. కొంగరకలాన్‌కు చెందిన సంపత్(25), ఉప్పుగూడకు చెందిన రమేశ్, చంద్రశేఖర్, సాయివిశాల్, శ్రీనివాస్, రజినీకాంత్ బుధవారం బయలుదేరారు. నిజామాబాద్‌లోని బాల్కొండ వద్ద లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సంపత్ మృతిచెందగా మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 13, 2025
పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్: మంత్రి

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. HYD విశ్వనగరమని, పెట్టుబడులకు గమ్యస్థానమని అన్నారు. మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభించడం సంతోషంగా ఉందని, ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
News February 13, 2025
హుస్సేన్ సాగర్ స్కైవాక్‌కు లైన్ క్లియర్

HYDలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కై వాక్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే HMDA ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానంలో నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. హుస్సేన్ సాగర్ చరిత్రను దృష్టిలో పెట్టుకొని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. స్కైవాక్‌తో పాటు సైకిల్ ట్రాక్‌ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు.