News July 29, 2024
HYD: మమ్మల్ని వీడియోలో చూపించండి: హరీశ్‌రావు
ప్రస్తుతం అసెంబ్లీ కొనసాగుతోంది. కాగా సభ ప్రారంభించే ముందు MLA హరీశ్‌రావు మాట్లాడుతూ.. BRS ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు వీడియోలో చూపించడం లేదని ప్రజలే చెబుతున్నారని అనడంతో కుత్బుల్లాపూర్ MLA వివేకానంద అవునని అన్నారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ.. అలా అనడం పొరపాటని, అందరినీ పర్‌ఫెక్ట్‌గా చూపిస్తున్నామని సమాధానం ఇచ్చారు.
Similar News
News December 21, 2024
RR: 8నెలలుగా కూలీలకు అందని జీతాలు.!
ఉమ్మడి RR జిల్లాలో 52 వరకు ఎస్సీ వసతి గృహాల్లో 8 నెలలుగా జీతాలు లేవని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.160 మంది అవుట్ సోర్సింగ్, 44 మంది దినసరి కూలీలు పనిచేస్తున్నారు. ఇంటిదగ్గర కుటుంబాన్ని పోషించడం భారంగా మారుతుందని, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు జీతాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
News December 21, 2024
HYD: శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ చికిత్సకు స్పందిస్తున్నాడు. వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉండగా.. అప్పుడప్పుడు జ్వరం వస్తోంది. నాడీ వ్యవస్థ ప్రస్తుతానికి స్థిరంగా పనిచేస్తుందని.. నిన్నటి కంటే ఈరోజు శ్రీతేజ ఆరోగ్యం మెరుగైందని శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
News December 21, 2024
HYD: నేడు ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు
ఎల్బీ స్టేడియంలో నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సాయంత్రం క్రిస్మస్ వేడుకలను నిర్వహించనుంది. ఈ క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎంతో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరుకాన్నారు. ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.