News May 20, 2024
HYD: మరో అరగంటలో నగర వ్యాప్తంగా వర్షం!

HYD నగరంలోని ఎల్బీనగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, మలక్పేట, బేగంపేట, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్, అమీర్పేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మరికొద్ది సేపట్లో వర్షం కురుస్తుందని ’తెలంగాణ వెదర్ మెన్‘ తెలిపింది. మరో అరగంటలో నగరంలోని ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. GHMC అధికారులు సైతం ప్రజలకు అలర్ట్ జారీ చేశారు.
Similar News
News October 15, 2025
రౌడీషీటర్ నవీన్రెడ్డి నగర బహిష్కరణ

రాచకొండ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. నల్గొండకు చెందిన రౌడీషీటర్ కొడుదుల నవీన్ రెడ్డిపై రాచకొండ సీపీ సుధీర్ బాబు నగర బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. దాడులు, హత్యాయత్నం, బెదిరింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాడన్న కారణంగా అధికారులు 6 నెలల బహిష్కరణ ప్రతిపాదన తీసుకురాగా సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన ప్రస్తతం అబ్దుల్లాపూర్మెట్ పరిధి మన్నెగూడలో ఉంటున్నాడు.
News October 15, 2025
HYD: ‘₹4,000 పెన్షన్ వస్తుందా!.. అందిరికీ తెల్సిందేగా’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ప్రచారం ఉపందుకుంది. మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, నాయకులు రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎర్రగడ్డ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళను ₹4,000 పెన్షన్ వస్తుందా? అని అడగ్గా ఆమె నవ్వుతూ ‘అందరికీ తెలిసిందేగా’ అని ఎద్దేవా చేశారు. ప్రజలు మళ్లీ కాంగ్రెస్ మాటలను నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు.
News October 15, 2025
HYD: రైళ్లలో బాణసంచా.. తీసుకెళ్తే తప్పదిక శిక్ష

దీపావళి సందర్భంగా రైల్వే శాఖ అప్రమత్తమైంది. బాణసంచాను రైల్లో తీసుకెళ్లొద్దని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులను హెచ్చరిస్తోంది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 164, 165 ప్రకారం రూ.1000 వరకు జరిమానా లేదా 3ఏళ్ల జైలు శిక్ష, రెండూ వర్తించే అవకాశం ఉందంటున్నారు. ఎవరైనా రైల్లో తీసుకెళ్తే RPF పోలీసులకు లేదా 139 నంబర్కు సమాచారం అందించాలని రైల్వే అధికారులు సూచించారు..