News May 20, 2024

HYD: మరో అరగంటలో నగర వ్యాప్తంగా వర్షం!

image

HYD నగరంలోని ఎల్బీనగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, మలక్పేట, బేగంపేట, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్, అమీర్పేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మరికొద్ది సేపట్లో వర్షం కురుస్తుందని ’తెలంగాణ వెదర్ మెన్‘ తెలిపింది. మరో అరగంటలో నగరంలోని ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. GHMC అధికారులు సైతం ప్రజలకు అలర్ట్ జారీ చేశారు.

Similar News

News December 5, 2024

HYD: రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు: మంత్రి

image

HYD రవీంద్ర భారతి కళాభవన్‌లో సీల్ వేల్ కార్పొరేషన్ ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘంటసాల జీవన సాఫల్య పురస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రవీంద్రభారతి కళాభవన్‌లో గాన గంధర్వడు ఎస్పీ బాలు విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని కవులు, కళాకారులు, సాహితీవేత్తలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

News December 5, 2024

HYD: పాన్ కార్డు కరెక్షన్స్.. ఇది మీ కోసమే!

image

HYD అమీర్‌పేట స్వర్ణ భారతి కాంప్లెక్స్ భవనంలో CSC హెడ్ ఆఫీసులో పాన్ కార్డు, పాస్ పోర్టు సర్వీసులు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాన్ కార్డులో పేరు, DOB మార్పులు చేర్పులు కూడా చేస్తామన్నారు. మిగతా సర్వీసులు సైతం అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
SHARE IT

News December 4, 2024

HYD: తార్నాక IICTలో ఉద్యోగాలు

image

55% మార్కులతో 10TH, ఇంటర్, ITI చేసిన అభ్యర్థులకు శుభవార్త. HYD తార్నాకలోని CSIR-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT) టెక్నీషియన్‌ విభాగంలో 29 ఖాళీలు ఉన్నాయి. భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రూ. 500 చెల్లించి అప్లై చేసుకోవచ్చు. SC, ST, మహిళా అభ్యర్థులు ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ: 26-12-2024.

SHARE IT