News December 11, 2024

HYD: ‘మళ్లీ మళ్లీ ఢిల్లీ.. ఇదే రేవంత్ లొల్లి’

image

HYD నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లటంపై ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ‘మళ్లీ మళ్లీ ఢిల్లీ.. ఇదే రేవంత్ లొల్లి. గల్లీలో అధికారం, ఢిల్లీలో బేరసారం. ప్రజలు వరదల్లో ఉన్నా, నిరుద్యోగులు రోడ్డెక్కినా, విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రులపాలైనా, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. పదవులు నిలుపుకోవడానికి, కార్పొరేషన్ కమిషన్లకు ఢిల్లీ పోవాల్సిందే’ అంటూ మండిపడ్డారు.

Similar News

News February 23, 2026

HYD: తెలుగు వర్సిటీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో TG ప్రభుత్వ సంగీత, నృత్యశాఖలో ఈ ఏడాదికి గానూ సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సుల వార్షిక పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారిణి ఎంవీ ఆదిలక్ష్మి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఫైన్ లేకుండా మార్చి 10లోగా, రూ.1,000 ఫైన్‌తో మార్చి 30లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 8143165646ను సంప్రదించవచ్చు. site: pstucet.org

News February 23, 2026

HYD: అమ్మాయిలూ జాగ్రత్త.. సజ్జనార్ వార్నింగ్

image

హైదరాబాద్‌లో పెళ్లిచూపులు, నిశ్చితార్థం పేరుతో జరుగుతున్న మోసాలపై యువతులను ట్విటర్ వేదికగా సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నిశ్చితార్థం తర్వాత చనువు పెంచుకుని, శారీరకంగా లోబరుచుకుని, ఆపై అదనపు కట్నం కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని CP పేర్కొన్నారు. పరువు పోతుందన్న భయంతో మౌనంగా ఉండవద్దని, ఇలాంటి వేధింపులు ఎదురైతే వెంటనే షీ టీమ్స్(9490616555) లేదా డయల్ 100ను సంప్రదించాలని సూచించారు.

News February 23, 2026

HYD: తెలుగు వర్సిటీలో పురస్కారాలు.. దరఖాస్తు చేసుకోండి

image

MAR 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా తెలుగు వర్సిటీలో యువ పురస్కార ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. నటన, దర్శకత్వం, మేకప్, లైటింగ్ ఇతర రంగాల్లో కృషిచేసిన యువత పురస్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 35ఏళ్లలోపు ఉన్నవారు అర్హులు. రిజిస్ట్రార్, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ, బాచుపల్లికి పోస్టు ద్వారా/నేరుగా MAR 5లోపు అప్లికేషన్స్ పంపవచ్చు.