News June 17, 2024

HYD: మళ్లీ వచ్చిన ధార్ GANG.. ఇవి గుర్తుంచుకోండి!

image

గ్రేటర్ HYDలో భయంకరమైన ధార్ గ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడుతోంది. తాజాగా హయత్‌నగర్‌లో ఒకేసారి 5 ఇళ్లల్లో చోరీలకు పాల్పడింది. దివ్యాంగులు, భిక్షగాళ్లు, పని మనుషుల్లా నటిస్తూ వస్తారని, రెక్కీ నిర్వహించి రాత్రవగానే ఇళ్లలోకి చొరబడతారని పోలీసులు తెలిపారు. అడ్డొచ్చిన వారిని చంపేసేందుకు సైతం వెనకాడరని హెచ్చరించారు. కాలనీల్లో భద్రతా సిబ్బంది నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటివి చేసుకోవాలన్నారు.
SHARE IT

Similar News

News November 17, 2025

HYD: బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్

image

నగరంలో పెరుగుతున్న కాలనీలు, జనాభా, మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులు పెంచాలంటూ డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. కుత్బుల్లాపూర్, ఘట్కేసర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మొయినాబాద్ వంటి ప్రాంతాల వారు సరిపడ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు స్పందించి బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

image

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్‌‌వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.