News June 17, 2024

HYD: మళ్లీ వచ్చిన ధార్ GANG.. ఇవి గుర్తుంచుకోండి!

image

గ్రేటర్ HYDలో భయంకరమైన ధార్ గ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడుతోంది. తాజాగా హయత్‌నగర్‌లో ఒకేసారి 5 ఇళ్లల్లో చోరీలకు పాల్పడింది. దివ్యాంగులు, భిక్షగాళ్లు, పని మనుషుల్లా నటిస్తూ వస్తారని, రెక్కీ నిర్వహించి రాత్రవగానే ఇళ్లలోకి చొరబడతారని పోలీసులు తెలిపారు. అడ్డొచ్చిన వారిని చంపేసేందుకు సైతం వెనకాడరని హెచ్చరించారు. కాలనీల్లో భద్రతా సిబ్బంది నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటివి చేసుకోవాలన్నారు. SHARE IT

Similar News

News November 21, 2025

రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోస్‌కు నోటీసులు

image

GHMC ఖజానాకు గండికొడుతున్న సినిమా స్టూడియోలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో విస్తీర్ణానికి ₹11.52 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండగా యాజమాన్యం ₹49 వేలు చెల్లింస్తోందని గుర్తించారు. జూబ్లీహిల్స్‌లోని రామనాయుడు స్టూడియో విస్తీర్ణం తక్కువ చూపుతూ ₹1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా ₹1,900 చెల్లిస్తుండడంతో GHMC సర్కిల్ 18 అధికారులు నోటీసులు జారీ చేశారు.

News November 20, 2025

‘ఇబ్రహీంపట్నం ఎస్సీ బాయ్స్ హాస్టల్‌‌లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదు’

image

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం SC బాయ్స్ హాస్టల్‌లో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రతిరోజూ అందిస్తోన్న అన్నం సరిగా ఉడకకపోవడం, గింజలు గట్టిగా ఉండటం, రుచి తగ్గిపోవడం, కొన్నిసార్లు తినడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఎదురవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఇదొక చిన్న సమస్యగా కాకుండా, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశమని, కలెక్టర్ స్పందించాలని కోరుతున్నారు.

News November 19, 2025

ప్రణాళికలు సిద్ధం చేసుకుని చీరలు పంపిణీ చేయాలి: రంగారెడ్డి కలెక్టర్

image

రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి మహిళా సమాఖ్య సభ్యులకు ఇందిరమ్మ చీరలు అందించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకొని పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. చీరల పంపిణీ కార్యక్రమం విషయం స్థానిక ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం అందించి, వారిని తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలన్నారు.ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.