News July 21, 2024

HYD: మహంకాళికి బోనం సమర్పించిన కేంద్ర మంత్రి

image

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. రాష్ర్టంలో వందల ఏళ్ల నుంచి బోనాల పండుగ సంప్రదాయం జరుపుతున్నామన్నారు. ఎక్కడా లేని బోనాల పండుగ మనకు మాత్రమే ప్రత్యేకమని అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

Similar News

News February 24, 2026

HYD: 3 కార్పొరేషన్ల వెబ్‌సైట్లు ఇవే!

image

300 డివిజన్లతో కూడిన GHMC మూడుముక్కలైన విషయం తెలిసిందే. GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు సంబంధించిన వెబ్‌సైట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. GHMC వెబ్‌సైట్ www.ghmc.gov.in, సైబరాబాద్ కార్పొరేషన్ cmc.telangana.gov.in, మల్కాజిరి కార్పొరేషన్ mmc.telangana.gov.in వెబ్‌సైట్లలో ప్రజలు సేవలు పొందొచ్చని అధికారులు తెలియజేశారు.
# SHARE IT

News February 24, 2026

థాయ్‌లాండ్‌లో కొత్త వైరస్.. జూపార్క్‌లో ‘బయో- బబుల్’

image

‘థాయ్‌లాండ్ మరణాలు ఒక హెచ్చరిక.. గాలి ద్వారా వైరస్ సోకకుండా అడ్డుకోవం మా లక్ష్యం’ అని నెహ్రూ జూపార్క్ సిబ్బంది తెలిపారు. శానిటైజేషన్‌కే పరిమితం కాకుండా, వన్యప్రాణుల మధ్య ‘సోషల్ డిస్టెన్సింగ్’ ఎన్‌క్లోజర్ల పర్యవేక్షణను పెంచారు. వైరస్ మ్యుటేషన్ చెందకుండా సోడియం హైపో క్లోరైడ్, జంతువుల ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే సప్లిమెంట్లను ఇస్తున్నారు. మూగజీవాల ప్రాణాలను కాపాడేందుకు యుద్ధం అని వివరించారు.

News February 24, 2026

మార్చి 2న HYDకు రాహుల్ గాంధీ

image

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ సందడి నెలకొంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే నెల 2న హైదరాబాద్‌కు రానున్నారు. ప్రధానంగా వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో నిర్వహించనున్న కాంగ్రెస్ శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో (DCC) రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఎన్నికలు, పార్టీ బలోపేతంపై సూచించనున్నారు.