News July 21, 2024
HYD: మహంకాళికి బోనం సమర్పించిన కేంద్ర మంత్రి
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. రాష్ర్టంలో వందల ఏళ్ల నుంచి బోనాల పండుగ సంప్రదాయం జరుపుతున్నామన్నారు. ఎక్కడా లేని బోనాల పండుగ మనకు మాత్రమే ప్రత్యేకమని అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
Similar News
News November 12, 2024
లగచర్లలో ప్రభుత్వ తీరు అమానుషం: హరీశ్ రావు
వికారాబాద్ జిల్లా <<14585618>>లగచర్లలో<<>> 300 మంది పోలీసులు మోహరించి స్థానికులను అరెస్టు చేయడం దారుణమని సిద్దిపేట MLA హరీశ్ రావు మండిపడ్డారు. ‘ఫార్మా భూసేకరణకు నిరాకరించిన గ్రామస్థులపై అర్ధరాత్రి పోలీసులతో దమనకాండ సరికాదు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశం తెలియాలి. వెంటనే ఈ భూసేకరణ ఆపాలి. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి’ అని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.
News November 12, 2024
హైదరాబాద్‌కు భగత్ సింగ్ మేనల్లుడి రాక
స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ మేనల్లుడు ప్రొ. జగ్మోహన్ సింగ్ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 26న హిమాయత్‌నగర్, 27 న కుత్బుల్లాపూర్‌లో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారని AISF, AIYF, CPI ప్రకటించాయి. భగత్‌సింగ్ ఆశయాలను కొనసాగిస్తున్న ప్రొ. జగ్మోహన్ సింగ్ మేధావులు, విద్యార్థులు, యువత, ఉద్యమకారులతో ఇంట్రాక్ట్ అవుతారని తెలిపారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని MLA కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.
News November 12, 2024
HYD: వానరానికీ శివుడే దేవుడు!
కార్తీకమాస సోమవారం కీసరగుట్టలో ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. శిరసా నమామి అంటూ ఓ వానరం శివయ్యను హత్తుకుంది. కీసరగుట్టలోని శివలింగానికి భక్తులు పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన వానరాలు శివలింగం చుట్టూ ఆటలాడాయి. నైవేద్యంగా పెట్టిన అరటి పండు తిన్న ఓ వానరం ఆకలి తీర్చావయ్యా అని అనుకుందేమో..! నువ్వే నాకు దిక్కు అంటూ లింగాన్ని నమస్కరించింది.