News October 2, 2024

HYD: మహనీయులకు నివాళులర్పించిన బీఆర్ఎస్ అగ్రనేతలు

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ అగ్రనాయకులతో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీలకు తెలంగాణ భవన్లో నివాళులర్పించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, పార్టీ నాయకులు, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్ తదితర ప్రముఖులతో కలిసి ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు.

Similar News

News October 30, 2025

BREAKING: తుఫాన్ ఎఫెక్ట్.. HYD శివారులో మహిళ మృతి

image

మొంథా తుఫాను కారణంగా HYD శివారులో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. మజీద్‌పూర్-బాటసింగారం మధ్య వాగు ఉద్ధృత రూపం దాల్చింది. అటుగా వచ్చిన దంపతులు వరదలో కొట్టుకుపోయారు. గమనించిన యువకులు భర్తను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. మహిళ నీటిలో గల్లంతై చనిపోయింది. మృతురాలు నెర్రపల్లికి చెందిన కృష్ణవేణిగా గుర్తించారు. పుట్టింటి నుంచి భువనగిరికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 30, 2025

జూబ్లీ ‘ఓటర్ థింక్’ డిఫరెంట్

image

ఎన్నికలొస్తే సికింద్రాబాద్ ‘లోక్ నాడీ’ అంతుచిక్కడం లేదు. GHMC, అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీకి, MP ఎన్నికల్లో ఇంకో పార్టీకి ఓటేస్తారు. విచిత్రం ఏంటంటే.. గతంలో లోక్‌సభ పరిధిలో అందరూ BRS MLAలే ఉన్నా MP‌ స్థానం BJP గెలిచింది. 2వ స్థానంలో INC వస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ బైపో‌ల్‌ ముంగిట పబ్లిక్ పల్స్ ప్రశ్నగా మారింది. ఎన్నికకో సర్ప్రైజ్ ఇచ్చే జనం ఈసారి ఏం చేస్తారో వేచిచూడాలి.

News October 30, 2025

హైదరాబాద్‌లో నేటి వాతావరణం ఇలా

image

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు పాక్షికంగా ఆకాశం మేఘావృతంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ‘సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, చిరు జల్లులు పడే అవకాశం ఉంది. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు కనిపించే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 21°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి దిశలో గంటకు 04- 08 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి’ అని పేర్కొంది.