News July 15, 2024

HYD: మహిళపై అత్యాచారయత్నం

image

మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన అల్వాల్ PSపరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీ‌నగర్‌కు చెందిన మహిళ శనివారం యాప్రాల్ నుంచి ఆటోలో అల్వాల్‌కు వచ్చింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. లోతుకుంటలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించగా.. ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News October 16, 2024

BREAKING: HYD: దంపతుల దారుణ హత్య

image

రంగారెడ్డి జిల్లాలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కందుకూరు PS పరిధి కొత్తగూడ ఫామ్ హౌస్‌లో దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉషయ్య(55), శాంతమ్మ(50)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 16, 2024

HYD: ‘మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టేందుకే ఎస్సీ వర్గీకరణ’

image

అన్నదమ్ముళ్లలా ఐక్యంగా ఉన్న మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టేందుకే ఎస్సీ వర్గీకరణ తెచ్చారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్ రాజు వస్తాద్ ఆరోపించారు. లోయర్ బ్యాంక్ బండ్‌లోని అంబేడ్కర్ భవన్లో సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం మాల మాదిగలను రెండుగా విభజించారని మండిపడ్డారు.

News October 16, 2024

HYD: RRR ప్రాజెక్ట్.. 1712 KM రేడియల్ రోడ్లు

image

HYD నగరానికి ORR నుంచి RRR కలుపుతూ రేడియల్ రోడ్ల నిర్మాణం జరగనుంది. రేడియల్ రోడ్ల ద్వారా ప్రయాణ సదుపాయం మరింత మెరుగుపడటమే గాక.. ట్రాఫిక్ సమస్య సైతం తగ్గుతుందని ఇంజినీరింగ్ యంత్రాంగం భావించింది. వివిధ దశల్లో ఈ నిర్మాణం పూర్తి కానుంది. రేడియల్ రోడ్ల నిర్మాణం పూర్తయితే మొత్తం 1712KM మేర 60 రోడ్లు అందుబాటులోకి రానున్నాయి.