News November 5, 2024
HYD: మహిళపై ముగ్గురి అత్యాచారం
అమీర్పేట్: మధురానగర్ PS పరిధిలో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇళ్లలో పనికి వెళ్లే ఓ మహిళ నిన్న కొండాపూర్లో పనికెళ్లి తిరిగొస్తుండగా ఆటోలో ముగ్గురు వచ్చి తమ గదిలో బట్టలు ఉతకాలని చెప్పి ఆమెను తీసుకెళ్లి రూమ్లో బంధించారు. నోట్లో బట్టలు కుక్కి, తీవ్రంగా కొట్టి ఆమెపై అత్యాచారం చేశారు. తప్పించుకున్న ఆమె దుస్తులు లేకుండా బయటకు రాగా పక్కింటి మహిళ గమనించి నైటీ ఇచ్చారు. కేసు నమోదైంది.
Similar News
News November 23, 2024
HYD: తెలంగాణ సంప్రదాయాలపై ప్రొఫెసర్ ప్రశంసలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై ఢిల్లీ ప్రొఫెసర్ అభిషేక్ ప్రతాప్సింగ్ ప్రశంసలు కురిపించారు. శిల్పకళా వేదికలోని కళా ప్రదర్శనలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. అనేక సంప్రదాయాలు ప్రకృతి నుంచి పుట్టాయన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఈ ప్రోగ్రాంలో పాల్గొని, కళాఖండాలను ఆస్వాదించారు. దేశ సంస్కృతిలో తెలంగాణకు ప్రత్యేకత ఉందన్నారు.
News November 23, 2024
నేడు హైదరాబాద్కు బైరి నరేశ్
మూఢ నమ్మకాల నిర్మూలన సమితి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు అంబేడ్కర్ రిసోర్స్ సెంటర్లో కులాంతర వివాహ జంటల అభినందన, సహపంక్తి భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జాతీయ అధ్యక్షుడు బైరి నరేశ్ తెలిపారు. ముఖ్య అతిథులుగా గద్దర్ కూతురు, సాంస్కృతిక సారథి ఛైర్పర్సన్ వెన్నెల, అంబేడ్కరిస్ట్ కేకే రాజా, పసునూరి రవీందర్, స్కైలాబ్, జర్నలిస్టు రాకేశ్, రెలారే గంగ హాజరవుతారని ఆయన తెలిపారు.
News November 23, 2024
రేపు ఓయూలో ప్రవేశ పరీక్ష
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయం ప్రాంగణంలోని డిస్టెన్స్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు చేసినట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఓయూ ఎంబీఏ (ఈవెనింగ్) 2 ఏళ్ల కోర్సు ప్రవేశ పరీక్షను రేపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.