News July 14, 2024
HYD: మహిళలకు ఉచితంగా ఆటో రిక్షా ట్రైనింగ్!

HYD, RR, MDCL,VKB జిల్లాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు చేయూతనిచ్చేందుకు వారికి ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఎండీ కాంతి వెస్లే వెల్లడించారు. 100 మంది మహిళలకు అవకాశం కల్పిస్తామని, డ్రైవింగ్ లైసెన్స్, సొంత ఎలక్ట్రిక్ వాహనం మైక్రో లోన్ అందిస్తామన్నారు. కూకట్‌పల్లిలోని మోనో ప్రాంగణంలో ట్రైనింగ్ అందిస్తామన్నారు.
Similar News
News December 9, 2025
HYD: ప్చ్.. ఈ సమ్మర్లో బీచ్ కష్టమే!

రూ.225 కోట్లతో 35 ఎకరాల్లో కొత్వాల్‌గూడలో మొట్టమొదటి కృత్రిమ బీచ్ ప్రతిపాదన ఈ వేసవికి కూడా కలగానే మిగిలేలా ఉంది. వేవ్ టెక్నాలజీతో కూడిన మ్యాన్‌మేడ్ సరస్సు, ఫ్లోటింగ్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, అడ్వెంచర్స్, థియేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. రూ.15,000 కోట్ల పర్యాటక సామర్థ్యాన్ని పెంచేలా DEC నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, వచ్చే ఏడాది మార్చిలోనే పనులు ప్రారంభంకానున్నట్లు సమాచారం.
News December 9, 2025
తెలంగాణలో సల్మాన్ ఖాన్ వెంచర్స్

సల్మాన్ ఖాన్ వెంచర్స్ తెలంగాణలో రూ.10,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధి చేయనుంది. తెలంగాణ రైజింగ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రకటనలలో ఇది ఒకటి. ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను ఆవిష్కరించడం విశేషం. ఈ ప్రాజెక్ట్ లగ్జరీ హాస్పిటాలిటీ, అనుభవపూర్వక విశ్రాంతి, క్రీడా మౌలిక సదుపాయాలు, పూర్తి స్థాయి ఉత్పత్తి పర్యావరణ వ్యవస్థను మిళితం చేస్తుంది.
News December 9, 2025
HYD: సిటీలో నీటిని తోడేస్తున్నారు!

మహానగరంలో భూగర్భజలాలను యథేచ్ఛగా వాడేస్తున్నారు. వాడాల్సిన నీటి కంటే ఎక్కువ తోడుతూ భూగర్భాన్ని ఖాళీ చేస్తున్నారు. భూమిలో ఇంకే నీటి కంటే వాడేనీరే అధికంగా ఉంటోంది. సరూర్‌నగర్, శేరిలింగంపల్లి, చార్మినార్, గోల్కొండ, అంబర్‌పేట, ఖైరతాబాద్, అసిఫ్‌నగర్, హిమాయత్‌నగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో వాడకం మరీ ఎక్కువగా ఉందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తేల్చింది.


