News March 3, 2025
HYD: మహిళలపై అత్యాచారం.. వారే అధికం..!

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాది నమోదైన అత్యాచార కేసుల్లో అత్యధికులు స్నేహితులు ఉండగా, తర్వాత సహోద్యోగులు, సంరక్షకులు, పని వాళ్లు, డ్రైవర్లు, బంధువులు ఉన్నారు. మరోవైపు ఇరుగు పొరుగువారు, కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా తేలింది. వీటి కోసం ఉమెన్ సేఫ్టీ సస్పెక్ట్ రిజిస్ట్రీ మైంటైన్ చేస్తున్నారు. దీనిద్వారా ఎప్పటికప్పుడు మహిళ యొక్క పరిస్థితి, వేధింపులను గూర్చి తెలుసుకోవడంతో పాటు నిఘా బెడుతున్నారు.
Similar News
News November 13, 2025
వేములవాడ: ID కార్డులుంటేనే అనుమతి

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్న క్రమంలో ప్రధాన ఆలయ పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. గురువారం నుంచి ప్రధాన ఆలయం పరిసరాల్లోకి గుర్తింపు కార్డులున్న వారిని మాత్రమే అనుమతించడానికి ఆలయ యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు ఆలయ అధికారులు గుర్తింపు కార్డుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.
News November 13, 2025
ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి దాడి చేశారు: FRO

చందంపేట మండలం గువ్వలగుట్ట తండాలో నిన్న జరిగిన దాడిపై ఫారెస్ట్ రేంజ్ అధికారి భాస్కర్ గురువారం కీలక విషయాలు వెల్లడించారు. అటవీ భూమిలో సాగు చేస్తున్న గిరిజనులను హక్కు పత్రాలు చూపాలని కోరామన్నారు. కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని వాగ్వాదానికి దిగి ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి రాళ్ళు, కర్రలతో దాడి చేసి గాయపరిచారని చెప్పారు.
News November 13, 2025
NLG: నిర్దిష్ట లక్ష్యంతోనే పనులు: DRDO

జిల్లాలో చేపట్టిన జల్ సంచయ్, జల్ భాగీదారి కార్యక్రమం చేపట్టిన పనులకు కేంద్ర జలశక్తి శాఖ పురస్కారం ప్రకటించడం సంతోషంగా ఉందని DRDO పీడీ శేఖర్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచనలతో తాము ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఈ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేశామన్నారు. నీటి వనరుల కొరత ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటిని సంరక్షించడంతో పాటుగా, భూగర్భజలాలు పెంచడమే కేంద్రంగా ఈ పనులు గుర్తించి నిర్వహించామన్నారు.


