News May 5, 2024

HYD: మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయండి: సీపీ

image

మహిళలు వేధింపులకు గురైనప్పుడు వెంటనే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ తరుణ్ జోషి కోరారు. షీటీమ్ రాచకొండ వాట్సాప్ నంబర్ 8712662111 ద్వారా లేదా ప్రాంత షీటీం అధికారుల నంబర్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం -8712662600, కుషాయిగూడ-8712662601, ఎల్బీనగర్ -8712662602, మల్కాజిగిరి -8712662603, వనస్థలిపురం-8712662604 నంబర్ల ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Similar News

News November 2, 2024

ముషీరాబాద్‌‌లో 2 వేల కిలోల దున్నరాజు

image

ముషీరాబాద్‌లో గోలు టూ దున్నరాజు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని BRS నేత ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. నారాయణగూడ సదర్ సమ్మేళనంలో ఈ దున్నరాజుని ప్రదర్శించనున్నారు. గోలు టూ 7 అడుగులకు పైగా ఎత్తు, 14 అడుగుల పొడవు, 2 వేల కిలోల బరువుతో భారీ ఆకారంలో‌ ఉంది. సాయంత్రం ముషీరాబాద్ నుంచి నారాయణగూడ వరకు‌ ర్యాలీగా వెళ్తారు. అక్కడి యాదవ సోదరులతో ‘అలయ్.. బలయ్’ తీసుకోనున్నట్లు హరిబాబు యాదవ్ తెలిపారు.

News November 2, 2024

HYD: నారాయణగూడలో నో ఎంట్రీ!

image

సదర్ ఉత్సవాలకు HYD నారాయణగూడ రెడీ అయ్యింది. దున్నరాజుల ప్రదర్శన చూసేందుకు ప్రతియేటా లక్షలాది మంది YMCAకు వస్తారు. దీంతో రాంకోఠి నుంచి నారాయణగూడ, బాగ్‌ లింగంపల్లి నుంచి కాచిగూడ, YMCA పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. సాయంత్రం 7 నుంచి తెల్లవారుజామున 3 వరకు సాధారణ వాహనాలకు నారాయణగూడలో అనుమతి ఉండదు. ప్రత్యామ్నాయ దారులు చూసుకోవాలని పోలీసులు సూచించారు.
SHARE IT

News November 2, 2024

HYD: NIMS‌లో పిల్లలకు ఉచితం

image

HYD NIMSలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం ఉచిత స్క్రీనింగ్‌ క్యాంపును నిర్వహిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ క్యాంపు నవంబర్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. పిల్లలలో ఉన్న లోపాలను గుర్తించి, అవసరమైన వారికి సర్జరీలు చేయనున్నట్లు NIMS డైరెక్టర్ డా. నగరి బీరప్ప, ప్లాస్టిక్ సర్జరీ HOD డా.పార్వతి తెలిపారు. CMRF, LOC, ఆరోగ్య శ్రీ, PMRF కింద ఈ ఆపరేషన్లు చేయనున్నారు.
SHARE IT