News November 12, 2024

HYD: మహిళలు ముందుడం గర్వంగా ఉంది: సుమ

image

బేగంపేటలో నిర్వహించిన మహిళా ప్రోగ్రాంలో యాంకర్ సుమ పాల్గొన్నారు. సుమ మాట్లాడుతూ.. భారతదేశపు అసలైన నిధి మహిళలే అని అన్నారు. ఆర్థికంగా మహిళా శక్తి ఎదుగుతుండటం తనకు ఎంతో గర్వంగా ఉందని అభిప్రాయపడ్డారు. పోటీ ప్రపంచంలో మహిళలు ముందుండడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, విద్యతో ఎన్నో సాధించవచ్చన్నారు. మహిళలకు స్వేచ్ఛ ఎంతో అవసరమని పేర్కొన్నారు.

Similar News

News October 18, 2025

HYD: సంపులో పడి చిన్నారి మృతి.. జర జాగ్రత్త..!

image

HYD నానక్ రాంగూడలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీఎన్జఓ కాలనీలో ఉండే పరమేశ్వర్, సంధ్యారాణి దంపతులకు కుమారుడు నిఖిల్ తేజ(4) ఉన్నాడు. ఈ క్రమంలో అంగన్‌వాడికి వెళ్లిన నిఖిల్ పక్కనే ఉన్న సంపులో ఆడుతూ పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో మృతిచెందాడు. కొద్దిసేపు తర్వాత తల్లిదండ్రులు వెతకడంతో సంపులో మృతదేహం లభించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News October 18, 2025

HYD: ‘పిల్లలు ఎలా పుడతారో తెలుసా’ అనడంతో విచారించిన టీచర్

image

సైదాబాద్ PS పరిధిలో <<18037331>>ముగ్గురు బాలికలపై<<>> ఓ యువకుడు లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. స్థానికుల కథనం మేరకు.. లైంగిక దాడి అనంతరం ఎవరికైనా చెబితే చంపేస్తానని యువకుడు వారిని బెదిరించాడు. సెలవుల తర్వాత పిల్లలు స్కూల్‌కు వెళ్లారు. తమ తోటి వారితో ‘పిల్లలు ఎలా పుడతారో తెలుసా’ అంటూ వారు మాట్లాడుతుంటే క్లాస్ టీచర్ విని విచారించింది. దీంతో లైంగిక దాడి విషయం వారు చెప్పగా టీచర్‌, పేరెంట్స్ PSలో ఫిర్యాదు చేశారు.

News October 18, 2025

HYD: అద్దె వాహనాలు, వసతి గడువు మరో ఏడాది పొడిగింపు

image

జిల్లా పంచాయ‌తీ అధికారి (DPO), డివిజ‌న్ లెవ‌ల్ పంచాయ‌తీ ఆఫీస‌ర్ల(DLPO) అద్దె వాహనాల వసతి మరో సంవత్సరం పాటు పొడిగించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అద్దె కార్ల ఫైల్‌కు ఆమోదం తెలిపారు. మొత్తం 31 మంది డీపీఓలు, 68 మంది డీఎల్పీఓలకు వాహనాలను కొనసాగించనున్నారు. రెంట్ల కోసం రూ.3.96 కోట్లు మంజూరు చేసిన ఫైల్‌పై పంచాయ‌తీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు.