News May 4, 2024

HYD: మహిళల వైపు కన్నెత్తి చూస్తే.. అంతే సంగతి!

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలు, బాలికలు, అమ్మాయిలను ఇబ్బంది పెడుతూ.. వెంబడించే పోకిరీల భరతం పడతామని షీ టీం పోలీసులు అన్నారు. కేవలం 15 రోజుల్లోనే 133 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారందరికీ కౌన్సిలింగ్ అందించారు. మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని సీపీ తరుణ్ జోషి తెలిపారు. మహిళలను వేధించే పోకిరీలను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Similar News

News December 21, 2025

చలి గుప్పెట్లో ఉమ్మడి రంగారెడ్డి.. 5.1 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. శనివారం మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో అత్యల్పంగా 5.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 5.8, మౌలాలిలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వీస్తున్న చల్లని గాలులకు ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News December 20, 2025

22వ తేదీ నుంచి యథావిధిగా ప్రజావాణి: నారాయణ రెడ్డి

image

కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం ఈనెల 22 నుంచి యథావిధిగా ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ఉదయం 10 గంటల నుంచి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులతో హాజరు కావచ్చని కలెక్టర్ సూచించారు.

News December 19, 2025

BREAKING: రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు

image

రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2018లో సరూర్‌నగర్ పరిధిలో 17 ఏళ్ల బాలికకు బలవంతపు పెళ్లి కేసులో పెళ్లి పెద్దగా వ్యవహరించిన బాలిక తండ్రికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. బాలిక భర్త, తండ్రికి రూ. 75వేల జరిమానా న్యాయమూర్తి వేశారు. బాధితురాలికి రూ.15లక్షల పరిహారాన్ని న్యాయమూర్తి మంజూరు చేశారు.