News May 4, 2024
HYD: మహిళల వైపు కన్నెత్తి చూస్తే.. అంతే సంగతి!

రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలు, బాలికలు, అమ్మాయిలను ఇబ్బంది పెడుతూ.. వెంబడించే పోకిరీల భరతం పడతామని షీ టీం పోలీసులు అన్నారు. కేవలం 15 రోజుల్లోనే 133 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారందరికీ కౌన్సిలింగ్ అందించారు. మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని సీపీ తరుణ్ జోషి తెలిపారు. మహిళలను వేధించే పోకిరీలను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Similar News
News October 21, 2025
HYD: పోలీస్ శాఖలో ‘టైగర్ జిందా హై’!

నిజాయితీ, అంకితభావంతో పనిచేసిన IPSలో KS వ్యాస్ ఒకరు. ASPగా కెరీర్ ప్రారంభించిన ఆయన నిజామాబాద్, నల్గొండ, విజయవాడలో SPగా పనిచేశారు. HYD ట్రాఫిక్లో కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. మావోయిస్టుల అణచివేత కోసం గ్రేహౌండ్స్ను స్థాపించారు. KS వ్యాస్ మీద కక్ష పెంచుకున్న నక్సల్స్ జనవరి 27, 1993న LB స్టేడియంలో కాల్చిచంపారు. కానీ, ఒక సీన్సియర్ IPS ఆఫీసర్గా పోలీస్ శాఖలో నేటికీ సజీవంగా ఉన్నారు.‘టైగర్ జిందా హై’!
News October 21, 2025
HYD: సెల్యూట్.. వీరులారా మీకు వందనం!

తెలంగాణ పోలీస్ శాఖ ఉలిక్కిపడిన ఘటన ఇది. మావోలు ఏకంగా పోలీస్ స్టేషన్ను పేల్చేశారు. ఇది జరిగి 28 ఏళ్లు గుడుస్తున్నా నేటికి అమరులైన పోలీసులే యాదికొస్తుండ్రు. 1997లో యాచారం PSలో జమీల్ అహ్మద్, రాజేశ్వర్ రావు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. పథకం ప్రకారం మావోలు స్టేషన్ను పేల్చివేయడంతో విధి నిర్వహణలోనే ప్రాణాలు విడిచారు. పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరులకు నివాళి అర్పిద్దాం.
News October 20, 2025
బండ్ల గణేశ్ ఇంటి నిండా టపాసులే

దీపావళి సందర్భంగా బండ్ల గణేశ్ తన ఇంట్లో వేడుకలకు సిద్ధమయ్యారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇంటి నిండా టపాసులు పరిచి ఫొటోని షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘తెలుగు లోగిళ్లలో ఆరోగ్య, ఆనంద, విజయాల కాంతులు వెల్లివిరియాలని కోరుకుంటూ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు’ అంటూ బండ్ల ట్వీట్ చేశారు.