News May 4, 2024

HYD: మహిళల వైపు కన్నెత్తి చూస్తే.. అంతే సంగతి!

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలు, బాలికలు, అమ్మాయిలను ఇబ్బంది పెడుతూ.. వెంబడించే పోకిరీల భరతం పడతామని షీ టీం పోలీసులు అన్నారు. కేవలం 15 రోజుల్లోనే 133 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారందరికీ కౌన్సిలింగ్ అందించారు. మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని సీపీ తరుణ్ జోషి తెలిపారు. మహిళలను వేధించే పోకిరీలను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Similar News

News November 7, 2024

HYD: నూతన టెక్నాలజీతో లీకేజీలకు అడ్డుకట్ట..!

image

HYD నగర ప్రజలకు మంచి నీటి సమస్య రాకుండా జలమండలి చర్యలు చేపడుతోంది. గండిపేట కాండ్యూట్ లీకేజీలతో 8ఎంజీడీ (30 లక్షల లీటర్లు) నీరు వృథా అవుతుందని గుర్తించిన అధికారులు, గ్రౌటింగ్ పద్ధతిలో కెమికల్ ట్రీట్మెంట్ టెక్నాలజీ ఉపయోగించి నీటి సరఫరాకు అంతరాయం కలిగించకుండా మరమ్మతులు చేస్తున్నారు. ఈ లీకేజీలు దాదాపు 14.5 కిలోమీటర్ల పొడవున ఉన్నట్లు గుర్తించామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.

News November 6, 2024

HYD: RRR దక్షిణ భాగం నిర్మాణంపై మరో ముందడుగు!

image

HYD శివారులో RRR దక్షిణ భాగంపై రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అలైన్మెంట్ సహా ఇతర అన్ని పనుల పర్యవేక్షణ కోసం త్వరలో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. RRR దక్షిణ భాగాన్ని తన ఆధ్వర్యంలోనే నిర్మించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేక IAS అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసింది.

News November 6, 2024

HYD: ఓటు హక్కు లేదా..? ఇది మీకోసమే..!

image

18 ఏళ్లు నిండి, ఇప్పటికీ ఓటు హక్కు లేని వారు వెంటనే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని CEO సుదర్శన్ రెడ్డి సూచించారు. నవంబర్ 28 వరకు నూతన ఓటరు దరఖాస్తు, మార్పు చేర్పులకు అవకాశం ఉందన్నారు. జనవరి 6న SSR-2025 విడుదల చేస్తామన్నారు. తాజాగా హైదరాబాద్‌లో-1,81,875, రంగారెడ్డి-1,18,513, మేడ్చల్ మల్కాజిగిరి-99,696 మంది నూతన ఓటర్లు కొత్తగా నమోదయినట్లుగా పేర్కొన్నారు.