News April 16, 2025

HYD: మహిళా భద్రత కోసం T-SAFE యాప్

image

మహిళా భద్రత కోసం యువత టెక్నాలజీని వినియోగిస్తున్నారని మహిళా భద్రత విభాగం డీజీ షికా గోయల్ తెలిపారు. T-సేఫ్ ఆండ్రాయిడ్ యాప్‌ను ఇప్పటి వరకు 42,000 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీనివల్ల 36,263 ట్రిప్పులు నమోదు కాగా, 30% పైగా మూడు కమిషనరేట్ల పరిదివే, 65,000కుపైగా ఏజెంట్ కాల్స్ అందినట్లు పేర్కొన్నారు. మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్నామని, T-SAFE యాప్ మీరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 24, 2025

కోదాడ శివారులో రోడ్డుప్రమాదం

image

కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శివ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివ మరణంతో ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదం ఎలా జరిగింది? మృతికి గల కారణాలేమిటి? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 24, 2025

GNT: జమాబందీ లేక భూ రికార్డుల్లో గందరగోళం

image

గుంటూరు జిల్లా రెవెన్యూ శాఖలో కీలకమైన జమాబందీ ప్రక్రియను కొన్నేళ్లుగా నిర్వహించకపోవడంతో భూమి రికార్డులు గందరగోళంగా మారాయి. తహశీల్దార్ కార్యాలయాల్లో ఆర్వోఆర్ నిర్వహణ సరిగా లేకపోవడం, కంప్యూటర్ ఆపరేటర్లపై పూర్తిగా ఆధారపడటం వల్ల అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. ఏటా జమాబందీ జరిగితే భూమి హక్కులు స్పష్టమవుతాయి. కానీ అది లేకపోవడంతో జిల్లాలో భూవివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

News December 24, 2025

OTTలోకి ‘బాహుబలి: ది ఎపిక్’

image

‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా ఈరోజు అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. బాహుబలి పార్ట్-1, పార్ట్-2ని కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’గా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ మూవీ డ్యూరేషన్ 3:48 గంటలు. కాగా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా తదితరులు కీలక పాత్రల్లో నటించిన ‘బాహుబలి’ మూవీ తెలుగు సినిమా చరిత్రనే మార్చేసింది. తెలుగు సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్‌ను పరిచయం చేసింది.