News March 6, 2025

HYD: మహిళా సదస్సు ఏర్పాట్లపై CS సమీక్ష

image

పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 8న జరగనున్న మహిళా సదస్సు ఏర్పాట్లపై CS శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం మహిళా శక్తి పాలసీ విడుదల చేయనుండగా, మహిళా సమాఖ్యలకు బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్సుల పార్కింగ్‌ కోసం బైసన్‌పోలో మైదానం సిద్ధం చేయాలని సూచించారు. పారిశుద్ధ్య ఏర్పాట్లు పర్యవేక్షించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

Similar News

News March 6, 2025

NLG: తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల

image

NLG MGUలో ఐసెట్ 2025 నోటిఫికేషన్‌ను సెట్ ఛైర్మన్, ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవి విడుదల చేశారు. జూన్ 8, 9వ తేదీల్లో 4 విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 10 నుంచి మే 3 వరకు సమర్పించవచ్చును. పూర్తి వివరాలకు https://icet.tsche.ac.inను సందర్శించాలన్నారు.

News March 6, 2025

ఖమ్మం: కాయిన్ మింగిన నాలుగేళ్ల చిన్నారి

image

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాండురంగాపురంలో నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ కాయిన్‌ మింగేశాడు. మోతీలాల్- శైలజ కుమారుడు ప్రద్యుత్ ఐదు రూపాయల కాయిన్‌తో ఆడుకుంటూ.. నోట్లో పెట్టుకుని మింగడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు గొంతులోని కాయిన్‌ను ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ లేకుండా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.

News March 6, 2025

సంగారెడ్డి: ఇంటర్ విద్యార్థులారా.. ఇది మీ కోసమే..!

image

ఇంటర్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఖాళీ కడుపుతో రాకుండా త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలైన ఇడ్లీ లేదా చద్దన్నం లాంటివి తిని రావాలని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువగా నీరు తాగుతుండాలన్నారు. పరీక్షలు రాసే సమయంలో ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సెంటర్‌లో అందుబాటులో ఉండే హెల్త్ అసిస్టెంట్‌లను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతిరోజు కనీసం 8గంటల నిద్ర ఉండాలన్నారు.

error: Content is protected !!