News June 4, 2024

HYD: మహిళ దారుణ హత్య.. కేసు నమోదు

image

ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన HYD బాలాపూర్ సమీపంలోని మీర్‌పేట్ PS పరిధి వినాయక హిల్స్‌లో కాసేపటి క్రితం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉంటున్న జటావత్ ప్రభు(45) అనే మహిళను ఆమె కూతురి అత్త సుత్తితో తలపై కొట్టి చంపేసింది. పోలీసులు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌ చేయడం గమనార్హం.

Similar News

News December 6, 2025

HYDలో పెరుగుతున్న ‘ఫబ్బింగ్’ కల్చర్!

image

సిటీలో సామాజిక విలువలు పడిపోవడానికి ‘ఫబ్బింగ్’ కారణం అవుతోంది. చుట్టూ అందరూ ఉన్నా వారిని పట్టించుకోకుండా స్క్రీన్ చూడటం, మెసేజ్‌లు చెక్ చేయడం, ఫోన్‌కే అతుక్కోవడాన్ని ఫబ్బింగ్ అంటారు. ఇది అవతలి వ్యక్తికి గౌరవం లేదన్న భావన కలిగిస్తుంది. ఒంటరితనం, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. బంధాలను నిలబెట్టాలంటే ఈ డిజిటల్ ద్రోహాన్ని ఆపాలి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఎవరు ఫబ్బింగ్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.

News December 6, 2025

గ్లోబల్ సమ్మిట్: రూ.250 లక్షల కోట్లే లక్ష్యం!

image

భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కేవలం పెట్టుబడుల సమావేశం కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక విధానాల విప్లవం. 2047 నాటికి $3 ట్రిలియన్ (సుమారు ₹250 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థ దిశగా ముఖ్యమంత్రి ఆవిష్కరించే ‘తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’ సారాంశమే ఈ సమ్మిట్. తయారీ, టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్‌ రంగాల్లో పటిష్ఠమైన, స్థిరమైన నూతన పాలసీలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.

News December 6, 2025

HYD: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

image

ఇండిగో విమానాల వరుస రద్దులతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరంగా ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్‌లు జత చేస్తూ ప్రయాణికుల రద్దీని తగ్గించే చర్యలు ప్రారంభించింది. దక్షిణ, తూర్పు, ఉత్తర, పశ్చిమ సహా పలురైల్వే జోన్లు మొత్తం 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు అమర్చి.. వచ్చే 10వ తేదీ వరకు ప్రయాణానికి ప్రత్యామ్నాయ సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి.