News January 14, 2025

HYD: మాంజా ప్రాణాలకు ముప్పు: డీసీపీ

image

HYD సీపీ ఆదేశాలతో ప్రమాదకరమైన చైనా మాంజా అమ్మకాలను అరికట్టినట్లు DCP సుదీంద్ర తెలిపారు. గాలిపటాలకు వాడే సింథటిక్ తీగ మానవ, వన్యప్రాణుల జీవితానికి ముప్పు అని తెలిపారు. దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. OCT- JAN మధ్య ఈ దారాలకు సంబంధించి 107 కేసులు నమోదు చేసి 148 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. రూ.88లక్షల బాబిన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.

Similar News

News September 18, 2025

ఈనెల 22 నుంచి ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ ఇంటర్ పరీక్షలు

image

జిల్లాలో టాస్క్ ఓపెన్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, TG ఓపెన్ స్కూలింగ్ సొసైటీ (TOSS) SSC & ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు రెండు సెషన్లలో ఉంటాయన్నారు.

News September 17, 2025

పేట్ల బురుజులో పోలీసుల శిశు సంరక్షణ కేంద్రం

image

మహిళా పోలీసుల కోసం నూతన శిశు సంరక్షణ కేంద్రాన్ని నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ బుధవారం ప్రారంభించారు. పేట్లబురుజులోని సీఏఆర్ ప్రధాన కార్యాలయంలో మహిళా పోలీసు అధికారుల పిల్లల కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. 150-200 మంది పిల్లలకు ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. మహిళా ఉద్యోగులు తమ పిల్లలను డ్యూటీ ప్రదేశానికి తీసుకువస్తే వారి సంరక్షణకు ఈ కేంద్రం ఎంతో భరోసా ఇస్తుందన్నారు.

News September 17, 2025

బేగంపేట ఎయిర్‌పోర్టులో రాజ్‌నాథ్‌కు వీడ్కోలు

image

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. పర్యటన అనంతరం తిరిగి ఢిల్లీ వెళుతున్న సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో కిషన్ రెడ్డి, రాష్ట్ర BJP అధ్యక్షుడు రామచంద్ర రావు, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో DCP రష్మీ పెరుమల్, డిఫెన్స్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.