News January 13, 2025

HYD: మాజీ ఎంపీ భౌతికకాయానికి మంత్రి నివాళులు

image

నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం భౌతికకాయానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు నివాళులు అర్పించారు. HYDచంపాపేట్‌లోని ఆయన నివాసానికి వెళ్లి జగన్నాథం కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. జగన్నాథంతో తనకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి బాధాకరమని, ఎంపీగా ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఓ సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Similar News

News December 3, 2025

REWIND: రంగారెడ్డిలో 135 ఏకగ్రీవం.. రూపాయి రాలేదు

image

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఫిబ్రవరి 2న పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించింది. ఏకగ్రీవ చిన్న పంచాయతీలకు రూ.10లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,185 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 135 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవీ కాలం ముగిసినా ఏకగ్రీవ పంచాయతీలకు ఇంకా పారితోషకం అందలేదు.

News December 2, 2025

RR: ‘రెండో విడత నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి’

image

గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు అన్ని విధాలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా అధికారిని నడుచుకోవాలని ఆదేశించారు.

News November 30, 2025

రంగారెడ్డి: మొదటి రోజు 450 నామినేషన్లు

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు కందుకూరు, చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 450 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందులో 178 పంచాయతీ స్థానాలకు 152 నామినేషన్ దాఖలు కాగా 1540 వార్డు స్థానాలకు 298 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.