News January 12, 2025
HYD: మాజీ ఎంపీ మృతి పట్ల కేసీఆర్ సంతాపం

మాజీ ఎంపీ, సీనియర్ నేత మందా జగన్నాథం మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కృషిని, పార్టీకి ఆయన అందించిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మందా జగన్నాథం మరణంతో తెలంగాణ సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. శోకతప్తులైన ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Similar News
News February 8, 2025
కాప్రా: బతికున్నప్పుడు దరఖాస్తు.. చనిపోయాక పెన్షన్

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలో 2022లో పెన్షన్ కోసం పలువురు వృద్ధులు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 191 మంది పెన్షన్ మంజూరైనట్లు సర్కిల్ అధికారులు జాబితా విడుదల చేశారు. ఆ జాబితాలో 32 మంది మృతుల పేర్లు ఉన్నాయని కాప్రా సర్కిల్ అధికార వర్గాల సమాచారం. బతికి ఉన్నప్పుడు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చనిపోయాక మంజూరు కావడం మున్సిపల్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది.
News February 8, 2025
HYD: ఆలుమొగల పంచాయితీలకు కారణాలు అవే..!

HYDలో ఆలుమొగల మధ్య గొడవలు కుటుంబాలలో చిచ్చురేపి, ప్రాణాలు తీస్తున్నాయి. నిత్యం సగటున ఒక్కో PSకు 15 నుంచి 20 వరకు దంపతుల తగాదాల ఫిర్యాదులు వస్తున్నాయి. మానసిక క్షోభ, ఆవేదన, అక్రమ సంబంధాలు, అనుమానం, క్షణికావేశంతో విచక్షణ కోల్పోతున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో ఒక్క ఏడాదిలో దాదాపు 40 మంది గృహిణులు ఆత్మహత్యకు గురయ్యారు, 54 మంది ఆత్మహత్యకు పాల్పడ్డట్లు రిపోర్టు చెబుతోంది.
News February 8, 2025
బాత్రూంలో 6 ఏళ్ల బాలికపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి

శంషాబాద్‌లో ఇన్‌ఫాంట్ స్కూల్ విద్యార్థినిపై బస్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తిన విషయం తెలిసిందే. ఈ నెల 4న రంగారెడ్డి జిల్లా కాగజ్‌ఘాట్‌లోని సిరి నేచర్ రిసార్ట్‌కి పిక్నిక్‌కు వెళ్లిన 6 ఏళ్ల బాలికపై బస్‌డ్రైవర్ బాత్రూంలో లైంగికదాడి చేశాడని విద్యార్థిని తల్లి శుక్రవారం మంచాల PSలో ఫిర్యాదు చేసింది. పాప ఇంటికి వచ్చి నొప్పిగా ఉందని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.