News August 7, 2024

HYD: మాజీ సైనికుడికి ఇచ్చిన భూమిపై దర్యాప్తు: హైకోర్టు

image

మాజీ సైనికుడికి ఇచ్చిన భూమిపై దర్యాప్తు చేయాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఆ భూమిపై నోటీసులు ఇచ్చి రెండు వైపుల వాదనలు వినాలని ఎమ్మార్వోను ఆదేశించింది. పెద్దషాపూర్లో మాజీ సైనికుల కోటాలో కేటాయించిన మూడెకరాల్లో రెండెకరాలను ఖారిజా ఖాతాగా పేర్కొంటూ కలెక్టర్‌కు ఎమ్మార్వో రాసిన లేఖను మాజీ సైనికుడు శ్యాంసుందర్‌రావు హైకోర్టులో సవాల్ చేయడంతో మంగళవారం విచారించింది.

Similar News

News September 16, 2024

HYD: SEP 17.. ఒకే రోజు మూడు కార్యక్రమాలు!

image

HYD నగరంలో సెప్టెంబర్ 17న ఒకేరోజు మూడు కార్యక్రమాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుపనుంది. అదే రోజును రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సెప్టెంబర్ 17న ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సైతం ప్రారంభంకానుంది.

News September 15, 2024

HYD: 16న నాగపూర్-సికింద్రాబాద్‌ ‘వందే భారత్’ ప్రారంభం

image

నాగపూర్ నుంచి సికింద్రాబాద్(SEC) మార్గంలో ఈ నెల 16న వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. నాగపూర్ నుంచి ఉ.5 గంటలకు బయలుదేరి మ.12:15కు SEC చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో SEC నుంచి మ.1 గంటకు బయలుదేరి రా.8:20కు నాగపూర్ చేరుకుంటుంది.కాజీపేట, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవగ్రాంలో హాల్టింగ్ ఉంటుంది.

News September 15, 2024

గణపతి నిమజ్జనానికి A-Z సర్వం సిద్ధం: ఆమ్రపాలి

image

HYD సరూర్‌నగర్‌ చెరువు, జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌, బహదూర్‌పుర మీరాలం, కాప్రా ఊర చెరువులో గణేశ్ నిమజ్జనానికి A-Z సిద్ధం చేసినట్లు GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. 172 రోడ్ల మరమ్మతులు, 36 ట్రాన్స్‌పోర్ట్‌, 140 స్టాటిక్‌ క్రేన్‌లు, 295 మొబైల్‌ క్రేన్స్‌, 160 గణేశ్ యాక్షన్‌ టీమ్స్‌, 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు, 308 మొబైల్‌ టాయిలెట్స్‌, 52,270 తాత్కాలిక స్ట్రీట్‌ లైట్స్‌ సిద్ధం చేసినట్లు చెప్పారు.