News June 15, 2024
HYD: మాత్రలు వికటించి వ్యక్తి మృతి
మద్యం మత్తులో అధిక మొత్తంలో జ్వరం మాత్రలు వేసుకున్న వ్యక్తి మాత్రలు వికటించి మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలంలో జరిగింది. పోలీసుల ప్రకారం.. మెట్లకుంట గ్రామానికి చెందిన పల్లెగడ్డ మల్లేశ్(32) జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మద్యం మత్తులో ఇంట్లో ఉన్న జ్వరం మాత్రలను అధిక మొత్తంలో వేసుకున్నాడు. దీంతో మాత్రలు వికటించి మల్లేశ్ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 8, 2024
HYD: అలా చేస్తే.. ఏడు జిల్లాల్లో ఆక్రమణలకు చెక్!
HYD నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ మాత్రం తగ్గటం లేదు. దీంతో HMDA పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించడంపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇదే కాని జరిగితే.. HYD, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు చెక్ పడనుంది.
News September 8, 2024
HYD: కొత్తపేటలో 54 అడుగుల కాలభైరవ మట్టి గణపతి
HYD కొత్తపేటలోని మోహన్ నగర్‌లో వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణహితంగా భారీ మట్టి గణపతిని తిరంగా యూత్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేశారు. 18 ఏళ్ల నుంచి గణపతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 54 అడుగుల కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిని ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు. ప్రముఖ శిల్పి నగేశ్ మట్టి గణపతిని రూపొందించినట్లు తెలిపారు.
News September 8, 2024
HYD: బాలాపూర్ గణపతి ప్రత్యేకతలు ఇవే..!
HYD బాలాపూర్ గణపతిని కళాకారులు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. తలపై భాగంలో అమృతం కోసం సముద్ర మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహ చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడో చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు.