News December 17, 2024
HYD: మాదకద్రవ్యాలను వినియోగిస్తే చర్యలు
న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాచకొండ పోలీసులు సూచించారు. ఈ వేడుకల్లో మాదకద్రవ్యాలను వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫామ్ హౌస్‌లతో పాటు పబ్‌ల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయనున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.
Similar News
News January 17, 2025
HYD: బ్రిజేష్ ట్రిబ్యునల్‌ను ప్రభుత్వం స్వాగతిస్తోంది: మంత్రి
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తెలంగాణకు సరైన న్యాయం జరిగేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. బచావత్ ట్రైబ్యునల్ ఎన్.బ్లాక్‌గా కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కనుందని తెలిపారు.
News January 16, 2025
RR: గంజాయి, డ్రగ్స్ డిస్పోజల్ చేయాలి: డిప్యూటీ కమిషనర్
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో రంగారెడ్డి డివిజన్ ఎక్సైజ్ యంత్రాంగంతో రంగారెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రంగారెడ్డి డివిజన్ పరిధిలోని 20 ఎక్సైజ్ పీఎస్‌లలో చాలా కేసుల్లో పట్టుబడిన గంజాయి, డ్రగ్స్ డిస్పోజల్ చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా వాహనాల వేలాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు.
News January 16, 2025
ఇబ్రహీంపట్నంలో దారుణం.. యువతిపై అత్యాచారం
HYD శివారు ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన వెలుగుచూసింది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న స్టూడెంట్‌పై అత్యాచారం జరిగింది. పూర్తి వివరాలు.. మంగళ్‌పల్లిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న యువతి పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. గదిలో ఒంటరిగా ఉన్న ఆమెపై అదే భవనంలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద పనిచేసే డ్రైవర్ అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో PSలో కేసు నమోదైంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.