News September 9, 2024
HYD: మాదాపూర్లో దేశంలోనే అతిపెద్ద సదస్సు

దేశంలోనే అతిపెద్ద ఇంధన పొదుపు సదస్సు హైదరాబాద్ వేదికగా కానుంది. సీఐఐ ఆధ్వర్యంలో 10 నుంచి 12వ తేదీ వరకు మాదాపూర్లోని HICCలో జరగనుంది. ఈ కార్యక్రమంలో 23వ ఎనర్జీ ఎఫిషియన్సీ సమ్మిట్, సీఐఐ నేషనల్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిల్వర్ జూబ్లీ, పవర్ ప్లాంట్ సమ్మిట్ 2024, పేపర్ టెక్ 2024, గ్రీన్ షుగర్ సమ్మిట్ 2024 వంటి 3 ప్రధాన రంగాలపై ప్రత్యేక సదస్సులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
Similar News
News October 27, 2025
HYD: కౌన్ బనేగా బైపోల్కా బాద్షా?

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా నాయకులు వ్యూహరచనలు చేస్తున్నారు. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానంలో సత్తా చాటాలని BRS భావిస్తోంది. రాజధానిలో గెలిచి రాష్ట్రమంతా తమవైపే ఉన్నారని నిరూపించుకోవాలని కాంగ్రెస్ కదనరంగంలోకి దిగింది. భాగ్యనగరంలో బోణీ కొట్టాలని BJP బరిలోకి దూకింది. జూబ్లీహిల్స్లో విజేత ఎవరు అనుకుంటున్నారు? COMMENT
News October 27, 2025
జూబ్లీహిల్స్ నుంచే BRS శవయాత్ర: కాంగ్రెస్

జూబ్లీహిల్స్ నుంచే BRS జైత్రయాత్ర అంటోన్న KTRకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ‘జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ శవయాత్ర మొదలైతది కేటీఆర్. ఏ ఇంటికి పోయినా పదేండ్లలో మీరు ఎగ్గొట్టిన హామీలే గుర్తుకొస్తాయి. మీ ముఖాలు చూసి ఇంకా ఎవరైనా ఓటు వేస్తారా?. జూబ్లీహిల్స్లోనే మీకు సమాధి. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ దాకా మీ పార్టీ ఉంటదా?’ అంటూ INCTelangana అధికారిక అకౌంట్లో ట్వీట్ చేసింది. దీనిపై మీ కామెంట్?
News October 26, 2025
చంచల్గూడ జైలుకు 150 ఏళ్ల చరిత్ర

చంచల్గూడ జైలు 1876లో నిర్మించబడింది. ఈ జైలుకు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం కాలంలో పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని నేరస్తులుగా ముద్ర వేసి క్రమశిక్షణ పేరుతో అణచివేయడం జరిగేది. నవాబులు తమకు విరోధంగా ఉన్నవారిని ఇక్కడ నిర్బంధించేవారు. అప్పట్లో 70 ఎకరాల్లో విస్తరించిన ఈ జైలు కాలక్రమంలో సంస్కరణలు, నగర విస్తరణ కారణంగా ప్రస్తుతం సుమారు 30 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది.


