News January 29, 2025
HYD: మాధవి హత్య.. చర్లపల్లి జైలుకు గురుమూర్తి

మాధవి హత్య కేసులో నిందితుడైన గురుమూర్తిని 14 రోజుల రిమాండ్ విధించారు. బుధవారం వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులు గురుమూర్తిని కోర్టుకు తరలించారు. భార్య మాధవిని చంపిన కేసులో నిందితుడు గురుమూర్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు ఫిబ్రవరి 11 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.
Similar News
News November 23, 2025
HYD: వీకెండ్ పార్టీ.. రోడ్డెక్కితే దొరికిపోతారు!

వీకెండ్ వస్తే మందుబాబులు వైన్స్, బార్లు, పబ్లో చిల్ అవుతారు. తాగిన మత్తులో సెల్ఫ్ డ్రైవింగ్ ప్రమాదమని తెలిసినా కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా HYD పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వందల మంది పట్టుబడ్డారు. వాహనాలు సీజ్ అయ్యాయి. కౌన్సెలింగ్, కోర్టుకెళ్లి జరిమానా కట్టాల్సిన పరిస్థితి. D & D డేంజర్ అని పోలీసులు హెచ్చరిస్తున్నా వినకుండా తనిఖీల్లో దొరికి తలలు పట్టుకుంటున్నారు.

పవన్ పర్యటనకు పటిష్ట భద్రత: కలెక్టర్

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ద్వారకాతిరుమల మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఆదివారం ఆమె ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జేసీ అభిషేక్ గౌడ్తో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులకు దిశానిర్దేశం చేశారు.