News July 26, 2024
HYD: మానవత్వం చాటుకున్న అల్వాల్ ట్రాఫిక్ ACP

విధి నిర్వహణలో చర్యలు తీసుకోవడమే కాదు.. ఆపద వస్తే చలించిపోతామని అల్వాల్ ట్రాఫిక్ ACP వెంకటరెడ్డి నిరూపించారు. ఇటీవల సుచిత్ర వద్ద రాంగ్ రూట్లో వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ సిబ్బంది చలానాలు వేస్తున్నారు. ఓ డెలివరీ బాయ్ తప్పించుకునేందుకు హడావుడిగా వెళ్తూ మరో వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇతర వాహనదారుడు కింద పడిపోయాడు. క్షతగాత్రుడికి ACP సపర్యలు చేశారు. ఆయన సేవల పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి.
Similar News
News January 5, 2026
RR: గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేశారా?

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నూతన, 6- 9 తరగతుల వరకు మిగిలిన సీట్లకు దరఖాస్తులు కోరుతున్నట్లు శంషాబాద్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పి.నాగేశ్వరరావు తెలియజేశారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులన్నారు. ఈ నెల 21లోపు కుల,ఆదాయం, బర్త్ సర్టిఫికెట్, 2 ఫొటోలు తీసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
News January 4, 2026
ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక

చేవెళ్లలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాలుర బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు చెన్నయ్యగౌడ్ మాట్లాడుతూ.. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను 2 జట్లుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 10, 11న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని వెల్లడించారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించాలన్నారు.
News January 2, 2026
HYD: AI కోర్సులకు ఫ్రీగా ఆన్లైన్ శిక్షణ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ML, డేటా సైన్స్ తదితర సాఫ్ట్వేర్ కోర్సులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సర్టిఫికెట్ ప్రదానం చేస్తామని తెలిపారు. అసక్తిగల అభ్యర్థులు జనవరి 15లోగా nationalskillacademy.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


