News March 15, 2025
HYD: మారనున్న యూనివర్సిటీ పేరు.. హిస్టరీ ఇదే!

నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై నేడు సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టనున్నట్లు సమాచారం. కాగా సరిగ్గా నలభై ఏళ్ల క్రితం 1985లో తెలుగు యూనివర్సిటీని NTR ప్రారంభించారు. దీనికే 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా నామకరణం చేశారు.
Similar News
News March 15, 2025
భీమవరంలో యువతి ఆత్మహత్యాయత్నం

భీమవరం డీఎన్ఆర్ కళాశాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని చిన్న వంతెన మీద నుంచి మురికి కాలవలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు, శ్రీనివాస్ అనే యువకుడు ఆ యువతిని రక్షించారు. యువతికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమస్య ఏంటి అని అడగ్గా తమ తల్లిదండ్రులు విడిపోతున్నారని బాధతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపింది.
News March 15, 2025
రాజమండ్రి: 23 నుంచి సీపీఐ రాజకీయ ప్రచార జాత

రాజ్యాంగ పరిరక్షణ, సోషలిజం, సెక్యులరిజం, సామాజిక న్యాయమే లక్ష్యంగా మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు సీపీఐ రాజకీయ ప్రచార జాత నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. రాజమండ్రిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ వందేళ్ల చరిత్రను నాటకాల ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ క్రమంలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
News March 15, 2025
ప్రకాశం: ఈనెల 19న మెగా జాబ్ మేళా

ఈనెల 19న ఒంగోలులోని శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో సంకల్ప్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ అన్సారియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్‌లో శనివారం జాబ్ మేళా ప్రచార గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 10 నుంచి పీజీ వరకు చదివిన యువత జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు.