News February 18, 2025
HYD: మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలి: సీఎం

గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీలో జరుగుతున్న షీల్డ్ 2025 సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలని, ఒకప్పుడు ఇంట్లో చొరబడి మాత్రమే దోపిడీలు చేసేవారని, ఇప్పుడు దొంగలు ఎక్కడో ఉండి మన సొమ్ము దోచేస్తున్నారన్నారు. పోలీసు వ్యవస్థ దేశం మొత్తం ఒక యూనిట్గా పని చేస్తేనే సైబర్ నేరాలను అరికట్టగలమన్నారు.
Similar News
News November 25, 2025
నిజామాబాద్ జిల్లాలో అతివలే కీలకం

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులు విడుదల చేసిన ఓటరు తుది జాబితా ప్రకారం నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లాలో మొత్తం 8,51,417 మంది ఓటర్లు ఉండగా మహిళలు 4,54,621 మంది ఉన్నారు. ARMR డివిజన్లో 1,95,092 మంది, BDN డివిజన్లో 1,21,591 మంది, NZB డివిజన్లో 1,46,938 మంది మహిళలు ఉన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా పురుషులు 3,96,778 మంది ఉన్నారు. ఇతరులు 18 మంది ఉన్నారు.
News November 25, 2025
గ్యాస్ లీకైనపుడు ఏం చేయాలంటే?

ఇంట్లో గ్యాస్ సిలిండర్, స్టవ్ లీకేజీ, నిర్వహణ లోపాలతో ప్రమాదాలు జరిగి తీవ్ర విషాదాలను మిగులుస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. గ్యాస్ లీకై దాన్ని అదుపు చేయలేకపోతే కిటికీలు, తలుపులు తెరవాలి. మంటలు చెలరేగితే మందపాటి దుప్పటి కప్పి ఆర్పేయాలి. రెగ్యులేటర్ను ఆపేయాలి. సిలిండర్ దగ్గర మంటలు చెలరేగితే తడిగా ఉండే గోనెసంచి/ వస్త్రాన్ని వేయాలి. అగ్నిమాపక శాఖ టోల్ఫ్రీ నంబరు 101కు సమాచారం ఇవ్వాలి.
News November 25, 2025
కంచిలి: విషాదం.. 8నెలల గర్భిణి మృతి

మరో నెల రోజులు గడిచి ఉంటే ఆమెకు పండంటి బిడ్డ పుట్టేది. అమ్మగారితో పాటు అత్తగారింట్లో చిన్నారి అడుగులు పడేవి. ఇంతలోనే విషాదం నెలకొంది. బయటి ప్రపంచంలోకి రాకముందే తల్లితో పాటు ఆ శిశువు కన్నుమూసింది. కంచిలి(M) అర్జునాపురానికి చెందిన ధనలక్ష్మి(26) 8నెలల గర్భిణి. నిన్న రాత్రి పురిటి నొప్పులొచ్చాయి. 108కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా బిడ్డతో సహా ధనలక్ష్మి ప్రాణాలొదిలింది.


