News September 30, 2024
HYD: మార్పు చెందకపోతే మనుగడ కష్టమే: ఇస్రో ఛైర్మన్

HYD బాలనగర్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC) ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవలు అందించినట్లు ISRO ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తోన్న మార్పులకు అనుగుణంగా మారకపోతే రిమోట్ సెన్సింగ్ మనుగడ కష్టమేనన్నారు. సాంకేతికతలో వేగంగా మార్పులు వస్తున్నాయని, సమాచారం అత్యంత వేగంగా కావాలని ప్రజలు, వ్యవస్థలు కోరుకుంటున్నాయన్నారు. రాబోయే 25 ఏళ్లకు వచ్చే మార్పులను అంచనా వేసి నివేదిక రూపొందించాలన్నారు.
Similar News
News February 26, 2026
HYD: రూ.2వేల కోట్లతో ఆవుల పంపిణీ

రాష్ట్రంలో పాల దిగుబడిని పెంచేందుకు పశుసంవర్థకశాఖ రూ.2వేల కోట్లతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది. HYD మినహాయించి అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు అవుతుంది. ప్రతి జిల్లాలో ఏటా 830 మంది రైతులకు 2 చొప్పున ఆవులను సబ్సిడీపై అందించనున్నారు. మూడేళ్లలో మొత్తం 79,680 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్క యూనిట్ ఖర్చు రూ.2,51,000గా అంచనా వేయగా 50% రైతు 50% సబ్సిడీ అందిస్తుంది.
News February 26, 2026
HYD: తల్లి మరణించినా ఎగ్జామ్‌కు హాజరు

HYD శివారు శంకర్‌పల్లిలో హృదయాన్ని కదిలించిందీ ఘటన. కేజీబీవీలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న కల్పన (40) మంగళవారం రాత్రి మరణించారు. బుధవారమే ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో, ఆమె కుమారుడు రవితేజ మాత్రం పరీక్షకు వెళ్లాలనుకున్నాడు. తల్లి మృతదేహం ఇంట్లోనే ఉండగా.. పరీక్ష పూర్తి చేసి అనంతరం తల్లి అంత్యక్రియలకు హాజరయ్యాడు.
News February 26, 2026
చర్లపల్లి: ఖైదీలకు నూనె తయారీపై శిక్షణ

చర్లపల్లి ఖైదీల వ్యవసాయ కాలనీ(పీఏసీ)లోని ఆయుర్వేద గ్రామంలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్‌ను జైళ్ల శాఖ డీజీ డా.సౌమ్య మిశ్రా ప్రారంభించారు. 6 సంవత్సరాల విరామం అనంతరం ఆయుర్వేద గ్రామాన్ని పునః ప్రారంభించారు. ఖైదీల సంక్షేమం, పునరావాసానికి ఈ శిక్షణ కేంద్రం దోహదపడుతుందని ఆమె స్పష్టంచేశారు. కార్యక్రమంలో DIGలు శ్రీనివాస్, సంపత్, సూపర్డెంట్లు భరత్ ప్రమోద్, ఆయుర్వేద వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.


