News October 16, 2024

HYD: ‘మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టేందుకే ఎస్సీ వర్గీకరణ’

image

అన్నదమ్ముళ్లలా ఐక్యంగా ఉన్న మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టేందుకే ఎస్సీ వర్గీకరణ తెచ్చారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్ రాజు వస్తాద్ ఆరోపించారు. లోయర్ బ్యాంక్ బండ్‌లోని అంబేడ్కర్ భవన్లో సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం మాల మాదిగలను రెండుగా విభజించారని మండిపడ్డారు.

Similar News

News October 16, 2024

HYD: ఆటోలో అత్యాచారం.. డ్రైవర్‌ అరెస్ట్

image

గచ్చిబౌలి PS పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆటో డ్రైవర్‌ ప్రవీణ్‌ను లింగంపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. సోమవారం RCపురంలో బస్సు దిగిన యువతి(32) నానక్‌రాంగూడకు వెళ్లేందుకు ఆటో‌ ఎక్కింది. ఆమెపై కన్నేసిన డ్రైవర్‌ HCU సమీపంలోని మసీద్ బండ వద్ద అత్యాచారం చేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. తాజాగా నిందితుడిని అరెస్ట్ చేశారు.

News October 16, 2024

HYD: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

DR.BR అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ సుధారాణి తెలిపారు. 2022-23, 2023-24లో డిగ్రీలో చేరిన 2nd, 3rd ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, సకాలంలో ఫీజు చెల్లించని వారు 30తేదీలోపు చెల్లించొచ్చని తెలిపారు. braouonline వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉంటాయన్నారు.

News October 16, 2024

షాబాద్‌ రావాలని మంత్రికి ఆహ్వానం

image

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామదూత స్వామి ఆధ్వర్యంలో నవంబర్ 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక మహోత్సవానికి రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షాబాద్ మండలం దివ్యదామం ప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానం అందించారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణలతో స్వామిజీలు మంత్రిని ఆశీర్వదించారు.